Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శుక్రవారం (05-04-18) దినఫలాలు - దైవ - పుణ్య కార్యక్రమాల పట్ల....

మేషం: వస్త్ర పరిశ్రమల వారికి లాభదాయకంగా ఉంటుంది. కొంతమంది మీ సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు చికాక

Advertiesment
శుక్రవారం (05-04-18) దినఫలాలు - దైవ - పుణ్య కార్యక్రమాల పట్ల....
, శుక్రవారం, 4 మే 2018 (08:50 IST)
మేషం: వస్త్ర పరిశ్రమల వారికి లాభదాయకంగా ఉంటుంది. కొంతమంది మీ సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు చికాకు కలిగిస్తాయి. దైవ, పుణ్య సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
వృషభం: ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. విద్యుత్, ఎలక్ట్రానికల్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. ఆస్థి వ్యవహారాల్లో సోదరీసోదరుల వైఖరి ఆందోళన కలిగిస్తుంది. అకాల భోజనం, శ్రమాధిక్యతల వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. స్త్రీలు విభేదాలకు పోకుండా లౌక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. 
 
మిధునం: చేతివృత్తుల వారికి అవకాశాలు లభించినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల కోసం ప్రయాణాలు చేయవలసివస్తుంది. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. తెలివితేటలతో వ్యవహరించడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. 
 
కర్కాటకం: మీ శ్రీమతితో అనునయంగా మెలగాలి. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులు, వ్యాపారులకు కలిసిరాగలదు. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. పాత రుణాలు తీర్చి తాకట్టు వస్తువులను విడిపిస్తారు. 
 
సింహం: రాజకీయనాయకులు సభలు, సమావేశాల కోసం ప్రయాణాలు చేయవలసివస్తుంది. చేతివృత్తుల వారికి అవకాశాలు లభించినా ఆదాయం అంతంతమాత్రంగానే ఉంటుంది. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. తెలివితేటలతో వ్యవహరించడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి.
 
కన్య: స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ఆకస్మికంగా మీలో వేదాంత ధోరణి కనిపిస్తుంది. ఉద్యోగ విరమణ చేసిన వారికి తోటివారు సాదర వీడ్కోలు పలుకుతారు. సభలు, సమావేశాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. మిత్రుల సహకారం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు. 
 
తుల: వృత్తి, ఉద్యోగ బాధ్యతల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఊహించని పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. బాకీలు, ఇంటి అద్దెలు, ఇతరత్రా రావలసిన బాకీలను లౌక్యంగా వసులు చేసుకోవాలి. ప్రయాణాలలో పరిచయం లేని వ్యక్తులను అతిగా నమ్మవద్దు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో చిన్న చిన్న తప్పిదాలు దొర్లే ఆస్కారం ఉంది. 
 
వృశ్చికం: ఒకనాటి మీ కష్టానికి నేడు ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబ, ఆర్థిక సమస్యలు సర్దుకుంటాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. స్త్రీ మూలకంగా వివాదాలు ఎదుర్కుంటారు. రుణాలు, చేబదుళ్లు ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించండి. ఇతరుల స్థితిగతులలో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. 
 
ధనస్సు: ఆర్థిక వ్యవహారాలలో ఒక అడుగు ముందుకేస్తారు. బ్యాంకు మందకొడిగా సాగుతాయి. స్త్రీలకు ఇరుగుపొరుగు వారి నుంచి విమర్శలు తప్పవు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. గృహమునకు వస్తువులు సమకూర్చుతారు. ఉద్యోగస్తులకు బరువుబాధ్యతలు అధికమవుతాయి. 
 
మకరం: వస్త్ర, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు పురోభివృద్ధి. ఉన్నతస్థాయి అధికారులు అపరిచితవ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. ప్రింటింగ్ రంగాల వారికి బాకీలు వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. నిర్మాణ పనులలో పనివారలతో సమస్యలు తలెత్తుతాయి. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. 
 
కుంభం: స్త్రీలకు గొంతు, తలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. మీ ప్రేమకు అందరి ఆమోదం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. రుణాలు తీరుస్తారు. 
 
మీనం: మీ శ్రీమతి, సంతానం ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగస్తుల దైవంతో కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. సేవ, ఆధ్యాత్మిక సంస్థల్లో సభ్యత్వాలు, పదవులు స్వీకరిస్తారు. వ్యాపారాభివృద్ధికి కావలసిన ప్రణాళికలు అమలుచేస్తారు. మీ కళత్ర మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహాలక్ష్మి మా ఇంట్లో వుండటంలేదని అనుకుంటారు... కారణం ఏమిటంటే?