05-05-2018 - శనివారం మీ రాశి ఫలితాలు.. ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం..
మేషం: దైవసేవ, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి అధికమవుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రేషన్ డీలర్లకు అధికారుల నుంచి వేధింపులు
మేషం: దైవసేవ, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి అధికమవుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రేషన్ డీలర్లకు అధికారుల నుంచి వేధింపులు అధికంగా ఉంటాయి. ఐరన్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి లాభదాయకం.
వృషభం: దృఢ సంకల్పంతో ముందుకు సాగండి. వ్యాపారాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తారు. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. రాజకీయనాయకులకు అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. మీ కళత్ర మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
మిధునం: ఆర్థికంగా అభివృద్ధి కానవచ్చినా మానసిక ప్రశాంతత ఉండజాలదు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయ వ్యాపారులకు కలిసివస్తుంది. కీలకమైన వ్యవహారాల్లో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. ఆకస్మిక ఖర్చులు, తప్పనిసరి చెల్లింపులు ఇబ్బంది కలిగిస్తాయి.
కర్కాటకం: ఎలక్ట్రానిక్, ఎ.సి. రంగాల్లో వారికి కలిసి రాగలదు. రిప్రజెంటేటివ్‌లకు, ప్రైవేటు సంస్ధలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల్లో వారికి పనిభారం అధికం కాగలదు. గృహోపకరణాలను అమర్చుకుంటారు.
సింహం: ఉద్యోగస్తులకు ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం అని గమనించండి. గృహంలో మార్పులు చేర్పులు వాయిదా పడతాయి. కుటుంబీకుల కోసం విరివిగా ధనం వ్యయం చేస్తారు. రచయితలకు, పత్రికా రంగంలో వారికి ప్రోత్సాహకరం. స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కుంటారు.
కన్య: అధిక ఉష్ణం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. మీ సంతానం కోసం అధికంగా శ్రమిస్తారు. మీ అతిథి మర్యాదలతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ఆత్మీయుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. స్త్రీలకు ఆడంబరాలు, విలాసాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు ఉన్నత విద్యలకై చేయు యత్నాలు ఫలిస్తాయి.
తుల: వ్యాపారాభివృద్ధికి నూతన పథకాలు చేపడతారు. బంధువుల రాకతో స్త్రీలలో ఉత్సాహం చోటు చేసుకుంటుంది. ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగస్తులు ఏమరుపాటు కూడదు. కాంట్రాక్టర్లకు పనివారలతో చికాకులు తప్పవు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి ఒత్తిడి అధికమవుతుంది.
వృశ్చికం: నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం పొందుతారు. ఇతరులకు వాహనం ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. కొబ్బరి, పండ్ల, పూల, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
ధనస్సు: కిరాణా, ఫ్యాన్సీ, మందులు, ఆల్కహాలు, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. క్రీడలపట్ల నూతన ఉత్సాహం కానవస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి కలిసివచ్చేకాలం. సంతాన విషయంలో సంజాయిషీలు ఇచ్చుకొనవలసి వస్తుంది. బంధుమిత్రులతో మనస్పర్థలు తలెత్తుతాయి.
మకరం: విద్యార్థులు లక్ష్యసాధనలో ముందడుగు వేస్తారు. మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొత్త యత్నాలు మెుదలుపెడతారు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీల ఆంతరంగిక వ్యవహారాలు బయటకు వ్యక్తం చేయటం వల్ల ఇబ్బందులు తప్పవు. విలువైన వస్తువుల పట్ల ఆకర్షితులౌతారు. ప్రముఖులను కలుసుకుంటారు.
కుంభం: పత్రిక, ప్రైవేటు సంస్ధలలోని వారికి ఓర్పు, పనియందు ఏకాగ్రత ఎంతో ముఖ్యం. మీరుచేసిన సాయానికి సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. దైవ, సేవా, పుణ్య కార్యాలలో నిమగ్నమవుతారు. రాజకీయనాయకులు తమ వాగ్ధాదాలను నిలబెట్టుకో లేకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు.
మీనం: ఆర్థిక విషయాలలో సంతృప్తి కానరాదు. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. ఏ మాత్రం పొదుపు సాధ్యంకాదు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది.