Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సోమవారం (07-05-18) దినఫలాలు - స్త్రీలకు పనివారలతో...

మేషం: ఉద్యోగస్తులకు సహోద్యోగులతో అప్రమత్తత అవసరం. ఎలక్ట్రానికల్, ఇన్వెర్టర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. బంధువులు, సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. కార్మికులకు, తాపీ పనివారికి సంతృప్తి కానరాదు. మీ

Advertiesment
సోమవారం (07-05-18) దినఫలాలు - స్త్రీలకు పనివారలతో...
, సోమవారం, 7 మే 2018 (08:38 IST)
మేషం: ఉద్యోగస్తులకు సహోద్యోగులతో అప్రమత్తత అవసరం. ఎలక్ట్రానికల్, ఇన్వెర్టర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. బంధువులు, సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. కార్మికులకు, తాపీ పనివారికి సంతృప్తి కానరాదు. మీ కళత్ర వైఖరి మీకు చికాకు కలిగించగలదు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది.
 
వృషభం: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. ఉత్తర ప్రత్యుత్తరాలు, సంప్రదింపులు సజావుగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. మీ సంతానం ఆరోగ్య విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది.
 
మిధునం: రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు విషయంలో పునరాలోచన అవసరం. చేతివృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. దైవ, సేవా కార్యల్లో మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. స్త్రీల మనోభావాలకు, తెలివితేటలకు, మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
కర్కాటకం: విద్యార్థులకు మిత్రబృందాల వల్ల సమస్యలు తలెత్తుతాయి. ప్రేమికుల మధ్య కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. విదేశీయ వస్తువులు పట్ల ఆకర్షితులవుతారు. రాబడికి మంచి ఖర్చులు అధికమవుతాయి. ప్రభుత్వ సంస్థల్లో వారు జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి గురవుతారు. 
 
సింహం: ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు ప్రగతి పథంలో కొనసాగుతాయి. స్త్రీలకు పనవారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. విలాసాల కోసం ధనం వ్యయం చేస్తారు. ఉద్యోగస్తులు యూనియన్ కార్యకలాపాల్లో ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. వస్త్ర, బంగారు, వెండి రంగాల్లో వారికి శుభదాయకం.
 
కన్య: విందు, వినోదాలలో ధనం విరివిగా వ్యయంచేస్తారు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. స్తీలకు ఆరోగ్యభంగం, వైద్యసేవలు అవసరమవుతాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. 
 
తుల: స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. రాజకీయాల్లో వారికి ఒత్తిడి, చికాకులు అధికం. మీ సంతానం విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. దుబారా వ్యయం అధికంగా ఉంటాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
వృశ్చికం: దైవ, సేవా, పుణ్య కార్యాలలో నిమగ్నమవుతారు. శత్రువులు మిత్రులుగా మారుతారు. గృహ వాస్తు దోష నివారణ వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకులపరుస్తాయి. రాజకీయనాయకులు తమ వాగ్ధానాలను నిలబెట్టుకోలేక పోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
ధనస్సు: వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలను ఇవ్వగలవు. స్త్రీలకు నరాలు, వెన్నెముక, దంతాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. వాహనం నిదానంగా నడపటం క్షేమదాయకం. పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాలా ప్రోత్సాహకరం. 
 
మకరం:  రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. బంధుమిత్రుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా పడతాయి. నూనె, మిర్చి, పసుపు, ఉల్లి, ఎండుమిర్చి, ధాన్యం వ్యాపారస్తులకు అభివృద్ధి. రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. 
 
కుంభం: చేతి వృత్తుల వారికి అవకాశాలు లభించినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి లాభాలు ఆర్జిస్తారు. ఖర్చులు అధికమవుతాయి. అనుకోకుండా ఒక చిన్నారితో విడదీయరాని బంధం ఏర్పడుతుంది. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. 
 
మీనం: రహస్య విరోధులు అధికం కావడం వల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్, ట్రాన్స్‌ఫర్‌లకు కొంతమంది అవరోధం కల్పిస్తారు. ఆలయ సందర్శనాలలో చురుకుగా పాల్గొంటారు. నిరుద్యోగులకు సదావకాశాలు చేజారిపోతాయి. బంధువులు మీ చిత్తశుద్ధని శంకించే ఆస్కారం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పురావస్తు శాఖ పరిధిలోకి శ్రీవారి ఆలయం... వెనక్కి తగ్గిన కేంద్రం