Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గురువారం (10-05-2018) దినఫలాలు - వ్యసనాలకు దూరంగా..

మేషం: కాంట్రాక్టర్లు, బిల్డర్లకు పనివారలతో చికాకులు, అధికారుల ఒత్తిడి అధికం. ఎంతటి క్లిష్టపరిస్థితులనైనా నిబ్బరంగా ఎదుర్కుంటారు. కార్యసాధనలో ఓర్పు, నేర్పు, పట్టుదల అవసరం. స్త్రీల ప్రతిభా పాటవాలు వెలుగ

Advertiesment
గురువారం (10-05-2018) దినఫలాలు - వ్యసనాలకు దూరంగా..
, గురువారం, 10 మే 2018 (08:34 IST)
మేషం: కాంట్రాక్టర్లు, బిల్డర్లకు పనివారలతో చికాకులు, అధికారుల ఒత్తిడి అధికం. ఎంతటి క్లిష్టపరిస్థితులనైనా నిబ్బరంగా ఎదుర్కుంటారు. కార్యసాధనలో ఓర్పు, నేర్పు, పట్టుదల అవసరం. స్త్రీల ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు.
 
వృషభం: దైవ కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. బేకరి, స్వీట్స్, తినుబండారాల వ్యాపారులకు కలిసివస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. తొందరపాటుతనం వల్ల ప్రేమికులు చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. 
 
మిధునం: వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు, చికాకులు ఎదుర్కుంటారు. పెద్దమెుత్తం నగదుతో ప్రయాణం క్షేమం కాదు. క్యాటరింగ్, ట్రావెలింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నాలు సాగించండి. అధికారులకు మీ సమర్థతపై నమ్మకం తగ్గుతుంది. భాగస్వామిక సమావేశాల్లో కొత్త అంశాలు చర్చకు వస్తాయి. 
 
కర్కాటకం: సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయం మీ ఉన్నతికి సహకరిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. దైవ దర్శనాల వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కార్యసాధనలో ఓర్పు, నేర్పు, పట్టుదల అవసరం. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి.
 
సింహం: భార్య, భర్తల మధ్య మనస్పర్ధలు సమసిపోతాయి. వ్యాపార రంగాలవారికి అధికారుల తనిఖీలు, పనివారల నిర్లక్ష్యం ఆందోళన కలిగిస్తాయి. పత్రికా సిబ్బందికి చికాకులు అధికమవుతాయి. ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు యధావిధిగా సాగుతాయి. ఓర్పు, మంచితనంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. 
 
కన్య: సాహిత్య వేత్తలకు ప్రత్యేక గుర్తింపు లభించును. భార్యా, బిడ్డలతో స్వల్పంగా మనస్ఫర్ధలు తలెత్తగలవు. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు ఏకాగ్రత అవసరం. గృహోపకరణాలను అమర్చుకొవటంలో మునిగిపోతారు. స్త్రీలు షాపింగ్‌లకు ధనం బాగా ఖర్చు చేస్తారు. సంఘంలో మీకు పేరు, ప్రఖ్యాతలు పెరుగును. 
 
తుల: బ్యాంకు పనుల్లో స్వల్ప ఆటంకాలను ఎదుర్కుంటారు. కిరాణా, ఫ్యాన్సీ, నిత్యవసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. శత్రువులు మిత్రులుగా మారుతారు. గృహణీలకు పనివారలతో సమస్యలు తలెత్తుతాయి. బంధు మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. సాహస ప్రయత్నాలు విరమించండి. 
 
వృశ్చికం: సోదరీ, సోదరుల మధ్య విబేధాలు తలెత్తుతాయి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. చిట్స్, ఫైనాన్సు రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలించవు. స్థిర బుద్ది లేకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
ధనస్సు: విదేశీయానం నిమిత్తం చేసే యత్నాలు ఒకకొలిక్కి వస్తాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి పనివారితో సమస్యులు తలెత్తుతాయి. వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఒక సమాచారం బాగా ఆలోచింపచేస్తుంది. 
 
మకరం: కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి. ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి. ముఖ్యుల గురించి ఆందోళన చెందుతారు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయేస్కరం. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. 
 
కుంభం: ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. బ్యాంకుల నుంచి పెద్దమెుత్తం నగదు డ్రా చేసే విషయంలో జాగ్రత్త వహించండి. మీ మంచి కోరుకునేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. 
 
మీనం: మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుట వలన మాట పడవలసి వస్తుంది. రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. యాదృచ్చికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. మీ సంతానం విజయం సంతోషం కలిగిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#HanumanJayanthi రోజున ఏ చిత్ర పటాన్ని ఉపయోగించాలి? తమలపాకుల పూజతో?