Webdunia - Bharat's app for daily news and videos

Install App

12-05-2018- శనివారం మీ రాశి ఫలితాలు.. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని?

మేషం: కుటుంబ, ఆర్థిక సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. మీ వాహనం ఇతరులకివ్వటం వల్ల ఇబ్బందులకు గురవుతారు. స్త్రీలకు ఇరుగు, పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. భాగస్వామిక సమావేశాల్లో మీ అభిప్రాయాలను కచ్చితంగా తె

Webdunia
శనివారం, 12 మే 2018 (08:34 IST)
మేషం: కుటుంబ, ఆర్థిక సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. మీ వాహనం ఇతరులకివ్వటం వల్ల ఇబ్బందులకు గురవుతారు. స్త్రీలకు ఇరుగు, పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. భాగస్వామిక సమావేశాల్లో మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి. సంతానం చదువుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు.
 
వృషభం: స్త్రీలకు ఆరోగ్య సంతృప్తి, శారీరక పటుత్వం నెలకొంటాయి. దైవదర్శనాలలో చురుకుగా పాల్గొంటారు. వృత్తుల వారికి ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి.
 
మిథునం: ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. ఉమ్మడి వెంచర్లు, సంస్థల స్థాపనలో పునరాలోచన అవసరం. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ విభాగం నుంచి ఒత్తిడి పెరుగుతుంది. సోదరీ సోదరుల నుంచి చికాకులు తప్పవు. ప్రేమికులు పెద్దలతో ఏకీభవించలేకపోతారు. కొబ్బరి, పండ్లు, చల్లని పానీయ వ్యాపారస్తులకు కలసివచ్చే కాలం. 
 
కర్కాటకం: బ్యాంకింగ్ వ్యవహారాలలో పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్ర సందర్శనాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలలో అసౌకర్యానికి గురౌతారు. మిత్రుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. రాజకీయాల్లో వారికి సదవకావకాశాలు లభిస్తాయి. ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. 
 
సింహం: స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ మాటకు కుటుంబంలో గౌరవం లభిస్తుంది. మీరు చేసిన వాఖ్యలు కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. అనుకోకుండా ఒక చిన్నారితో విడదీయరాని బంధం ఏర్పడుతుంది.  
 
కన్య: మితిమీరిన శరీర శ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రేమికులకు ఎడబాటు, చికాకులు తప్పవు. పారిశ్రామిక రంగాల వారికి అన్నీవిధాలా ప్రొత్సాహకరం. పొదుపు దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. ఆదాయం పెంచుకునేందుకు చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. సాహస యత్నాలు విరమించండి.  
 
తుల: రావలసిన ధనం అందటంతో తాకట్టు పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు. విద్యా సంస్థలలోని వారికి ఒత్తిడి, పెరుగుతుంది. కీలకమైన వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అధిక పర్యటనల వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది.
 
వృశ్చికం: ఉద్యోగస్తులు కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. చేతివృత్తుల వారికి, చిరువ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు.  
 
ధనస్సు: మార్కెటింగ్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అధిక పర్యటనల వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. దైవ, ఆరోగ్య విషయాలు పట్ల ఆసక్తి పెరుగుతుంది. షాపింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. ఇతరుల ముందు కుటుంబ విషయాలు ఏకరువు పెట్టటం మంచిది కాదు.  
 
మకరం: బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి గురవుతారు. మీరు చాలా కాలంగా చేయాలనుకున్న పనులను తక్షణమే పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. విద్యుత్, ఎ.సి., కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి లభిస్తుంది. రిప్రజెంటెటివ్‌లకు, ప్రైవేటు రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది.  
 
కుంభం: ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించునపుడు మెళకువ అవసరం. సన్నిహితులతో ఒక పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. టెక్నికల్, కంప్యూటర్ రంగాలలోని వారికి సత్కాలం. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. మీ సంతానం మెుండివైఖరి మీకు చికాకులు కలిగిస్తుంది.  
 
మీనం: మీ హోదాకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. నూనె, మిర్చి, పసుపు, ఉల్లి, ఎండుమిర్చి, ధాన్యం వ్యాపారస్తులకు అభివృద్ధి. ఎంతటి క్లిష్టపరిస్థితులనైనా నిబ్బరంగా ఎదుర్కుంటారు. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రయాణాలు, ఒప్పందాల్లో మెలకువ వహించండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్యాచార బాధితులకు ఎక్కడైనా వైద్యం చేయాలి : ఢిల్లీ హైకోర్టు

Pawan Kalyan: పవన్ 100 పెళ్లిళ్లైనా చేసుకోవచ్చు.. శ్రీకృష్ణుడి స్థానంలో పుట్టాడు.. మహిళా ఫ్యాన్ (video)

వైకాపా విధ్వంసానికి పరిష్కారం లభించడం లేదు : సీఎం చంద్రబాబు

Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన ఎలా సాగిందంటే? (video)

Shawls Turned Dresses: దుస్తులుగా మారిన శాలువాలు.. ఎమ్మెల్యే చింతమనేని అదుర్స్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమల కోసం స్వర్ణ ఆంధ్ర విజన్-2047: టీటీడీ ప్రారంభం

19-12-2024 గురువారం దినఫలితాలు : పందాలు, బెట్టింగులకు దూరంగా ఉండండి..

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

తర్వాతి కథనం
Show comments