Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోమవారం (16-07-2018) దినఫలాలు - ఒంటరిగానే లక్ష్యాలను..

మేషం: కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాధించి పెడుతుంది. నిత్యవసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. క్రీడల పట్ల ఆసక్తి చూపిస్తారు. వాహన చోదకులకు ఏకాగ్రత అవసరం. స్థిరచరాస్తుల

Webdunia
సోమవారం, 16 జులై 2018 (08:24 IST)
మేషం: కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాధించి పెడుతుంది. నిత్యవసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. క్రీడల పట్ల ఆసక్తి చూపిస్తారు. వాహన చోదకులకు ఏకాగ్రత అవసరం. స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం.
 
వృషభం: రియల్ ఎస్టేచ్ వ్యాపారులకు ఒత్తిడి తప్పదు. ఒంటరిగానే లక్ష్యాలను సాధిస్తారు. స్త్రీలు షాపింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. దంపతుల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి. దైవ, సేవా సాంఘిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. విదేశాల నుండి ప్రత్యేక విషయాలు విని సంతోషిస్తారు. 
 
మిధునం: ఇరుగు పొరుగు వారి మధ్య కలహాలు అధికమవుతాయి. హోటల్, తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. అపరాలు, ధాన్య స్టాకిస్టులకు జాగ్రత్త అవసరం. సేవా సంస్థలకు విరాళాలివ్వడం వలన మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. రాజకీయనాయకుల వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
కర్కాటకం: ఆహార వ్యవహారాల్లో మెళకువ వహించండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత, సహనం ఎంతో ముఖ్యం. దూరపు బంధువుల ప్రోత్సాహంతో పనులలో పురోభివృద్ధిని సాధిస్తారు. మీ వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. 
 
సింహం: ఒక ఖర్చు నిమిత్తం తెచ్చిన ధనం మరొక అవసరానికి వినియోగిస్తారు. వృత్తులతో వారికి చికాకులు, డాక్టర్లకు లాభదాయకం. ఆడిటర్లకు మిశ్రమ ఫలితం. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి అధికమవుతుంది.  
 
కన్య: కొన్ని సమస్యలు పరిష్కరించలేనంత జటిలమై చికాకు పుట్టిస్తాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. సాహన ప్రయత్నాలు విరమించండి. స్త్రీలకు షాపింగ్ విషయాలలో అప్రమత్తత అవసరం. ఎలక్ట్రానికల్, వైజ్ఞానిక, శాస్త్ర, కంప్యూటర్, టెక్నికల్ రంగాలలో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానవచ్చును.  
 
తుల: శ్రీవారు, శ్రీమతి విషయాల్లో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతాయి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల వలన అప్రమత్తత అవసరం. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. అపరాలు, ధాన్యం వాణిజ్య వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో ఇబ్బందులు లెదురవుతాయి. 
 
వృశ్చికం: ఇంట్లో, వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేర్పులకు ప్రయత్నిస్తారు. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమోబైల్ రంగాలలో వారికి మంచి మంచి అవకాశాలు లభించి పనిభారం అధికమవుతుంది. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కుంటారు.
 
ధనస్సు: సాంఘిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. స్త్రీలు తొందరపాటుతనం వలన ప్రియతములను దూరం చేసుకుంటారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. మీ కళత్ర మెుండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
మకరం: ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. బంధువుల నుండి ఒత్తిడి, మెుహమ్మాటాలు ఎదుర్కుంటారు. గణిత, సైన్స్, సాంకేతిక పరిశోధకులకు, అంతరిక్ష రంగాల్లో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రత్యర్థులు మిత్రులుగా మారి మీకు సహాయాన్ని అందిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల సమాచారం అందుతుంది. 
 
కుంభం: విద్యార్థులు పెద్దల పట్ల, ప్రముఖుల పట్ల విముఖంగా వ్యవహరించడం వలన మాటపడక తప్పదు. గృహాలంకారణకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. నిత్యావసర సరుకుల స్టాకిస్టులకు, వ్యాపారాలకు సంతృప్తి, పురోభివృద్ధి. మీకు, బంధువులకు మధ్య తలెత్తిన కలతలన్నీ దూరమై అంతా కలిసిపోతారు.
 
మీనం: ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వైద్యులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు మార్పుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలు వస్త్రాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. బ్యాంకింగ్ వ్యవహారాలలోని పనులు మందకొడిగా సాగుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జామా మసీదు సమీపంలో అల్లర్లు - బలగాల మొహరింపు

ఆమె వయసు 36, ముగ్గురు పిల్లల తల్లి - ఇంటర్ విద్యార్థితో లేచిపోయింది...

Ambati Rayudu: పవన్‌కు ఇష్టం లేకున్నా.. ఏపీకి సీఎంను చేస్తా: అంబటి రాయుడు

పొరుగు రాష్ట్రాల మహిళలకు ఇప్పటికీ విద్యా హక్కు లేదు: మంత్రి దురైమురుగన్

ఉద్యోగం పేరుతో నయా మోసం... ఫేక్ కంపెలీ పేరుతో ఆఫర్ లెటర్... రూ.2.25 లక్షలు వసూలు

అన్నీ చూడండి

లేటెస్ట్

Yadagirigutta: టీటీడీ తరహాలో యాదగిరిగుట్టకు ట్రస్టు బోర్డు

07-03-2025 శుక్రవారం దినఫలితాలు- సంతోషకరమైన వింటారు. మీ కష్టం ఫలిస్తుంది..

తితిదే అన్నప్రసాదంలో అవి గారెలా? వడలా?: తితిదే ఛైర్మన్‌కి ప్రశ్నల వర్షం

ఈ రంజాన్ మాసంలో దుబాయ్‌లో ఐదు ముఖ్యమైన ఇఫ్తార్ ప్రదేశాలు

శని - రాహువు కలయిక.. అశుభ యోగం.. కన్య, ధనుస్సు రాశి వారు జాగ్రత్త!

తర్వాతి కథనం
Show comments