Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గురువారం (12-07-2018) దినఫలాలు - ఆపద సమయంలో...

మేషం: విద్యార్థినులు ప్రేమ వ్యవహారాల్లో లౌక్యంగా వ్యవహరించవలసి ఉంటుంది. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి చూపుతారు. గృహ మరమ్మత్తులు వాయిదా పడుతాయి. రుణ ప్రయత్నాలలో ఆటంకాలను ఎదుర్కుంటారు. ప్రయాణాలలల

Advertiesment
గురువారం (12-07-2018) దినఫలాలు - ఆపద సమయంలో...
, గురువారం, 12 జులై 2018 (08:45 IST)
మేషం: విద్యార్థినులు ప్రేమ వ్యవహారాల్లో లౌక్యంగా వ్యవహరించవలసి ఉంటుంది. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి చూపుతారు. గృహ మరమ్మత్తులు వాయిదా పడుతాయి. రుణ ప్రయత్నాలలో ఆటంకాలను ఎదుర్కుంటారు. ప్రయాణాలలలో వస్తువుల పట్ల మెళకువ వహించండి. పరిచయాలు మరింతగా బలపడుతాయి.
 
వృషభం: కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి, శ్రమాధిక్యత ఎదుర్కోవలసి వస్తుంది. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళకువ అవసరం. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది.  
 
మిధునం: వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల అవసరం. ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. నూతన వ్యాపారులకు కావలసిన పెట్టుబడులు వాయిదా పడుతాయి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. 
 
కర్కాటకం: దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వలన మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. స్త్రీల ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజార్చుకునే అవకాశం ఉంది. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. 
 
సింహం: ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. లాయర్లకు చికాకులు తప్పవు. స్త్రీలకు చుట్టు పక్కలవారితో విబేధాలు తలెత్తుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అనుకున్న పనులలో ఆటంకాలు ఎదురైనా మెుండిధైర్యంతో ముందుకుసాగి పూర్తిచేస్తారు. సోదరులకు మీ వంతు సహాయ సహాకారాలు అందిస్తారు.
 
కన్య: ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. రుణాలు, పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు. ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలను తెచ్చుకోకండి. కోర్టు వ్యవహారాలు సామాన్యంగా ఉండగలవు. అనుకున్న పనులలో ఏకాగ్రత లోపం వలన చికాకులు వంటివి ఎదుర్కోక తప్పదు. 
 
తుల: ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ లక్ష్యం నెరవేరదు. హోటల్, తినుంబడారాల వ్యాపారస్తులకు లాభాదయకం. బంధుమిత్రులతో రహస్య సంభాషణలు కొనసాగిస్తారు. స్త్రీలు టీ.వి. ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి.
 
వృశ్చికం: వైద్యులకు శస్త్రచికిత్సలలో ఏకాగ్రత అవసరం. అధికారులకు పర్యటనలు, తనిఖీలు అధికం. స్పెక్యులేషన్ రంగాలవారి అంచనాలు తారుమారవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలల్లో మిత్రుల సలహాపాటిస్తారు. ఓర్పు, శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు. మీ సంతాన విషయంలో సంతృప్తి కానవస్తుంది. 
 
ధనస్సు: కళ, క్రీడ, శాస్త్ర రంగాల వారికి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. స్త్రీలకు సంపాదన పై ఆసక్తి పెరుగుతుంది. కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.  భాగస్వామిక వ్యాపారాలనుండి విడిపోయి సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన స్పురిస్తుంది. చేయని యత్నాలకు ప్రతిఫలం ఆశించకండి. 
 
మకరం: మీకు రాబోయే ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు సిద్ధమవుతాయి. నూనె, మిర్చి, మినుము వ్యాపారస్తులకు స్టాకిస్టులకు అభివృద్ధి కానవస్తుంది. ఒక సమావేశానికి సంబంధించి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. పాత సమస్యలు పరిష్కరిస్తారు. విదేశాల్లో ఉంటున్న ఆత్మీయుల క్షేమసమాచారాలు ఊరట కలిగిస్తాయి. 
 
కుంభం: ఉద్యోగ, వృత్తుల వారికి ఆశించిన పురోభివృద్ధి ఉండదు. మీ శ్రీమతి తీరు చికాకు కలిగిస్తుంది. రియల్‌ఎస్టేట్ వ్యాపారస్తులకు నూతన ఆలోచనలు స్పురిస్తాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. స్థిరాస్తి కొనుగోళ్ళకు సంబంధించిన వ్యవహారాలు వాయిదా పడుతాయి.
 
మీనం: ప్రభుత్వ కార్యలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. బంధువులను కలుసుకుంటారు. కోర్టు వ్యాజ్యాలు, వివాదాలు కొలిక్కి వస్తాయి. ఎదుటివారు విషయాలకు దూరంగా ఉండడం మంచిది. మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు అవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పువ్వులు-పండ్లు బుట్టతో ఎదురైనా వారి శకునం? మంచిదేనా?