Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆదివారం (08-07-2018) దినఫలాలు - మీరు ప్రేమించే వారి వల్ల...

మేషం: కుటుంబ సౌఖ్యం అంతగా ఉండదు. వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథాకాలు మందకొడిగా సాగుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు. విదేశీయాన ప్రయాణాలు వాయిదా పడుతాయి. పెద్దల

Advertiesment
ఆదివారం (08-07-2018) దినఫలాలు - మీరు ప్రేమించే వారి వల్ల...
, ఆదివారం, 8 జులై 2018 (09:51 IST)
మేషం: కుటుంబ సౌఖ్యం అంతగా ఉండదు. వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథాకాలు మందకొడిగా సాగుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు. విదేశీయాన ప్రయాణాలు వాయిదా పడుతాయి. పెద్దల ఆరోగ్యములో మెళకువ అవసరం. గొప్ప గొప్ప అవకాశాలు మీ దరిచేరుతాయి.
 
వృషభం: సినిమా, విద్యా, సాంస్కృతిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. కాంట్రాక్టర్లకు పనివారలతో చికాకులు తప్పవు.     
 
మిధునం: కోళ్ళ, మత్స్య, పాడి పరిశ్రమ, గొఱ్ఱెల రంగాలలో వారికి అనుకున్నంత సంతృప్తిగా ఉండదు. విదేశీయాన ప్రయాణాలు వాయిదాపడుతాయి. ఏదైనా అమ్మకానికై చేయు యత్నాలు వాయిదా పడగలవు. మీ రాక బంధువులకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రముఖులకు కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది.  
 
కర్కాటకం: బంధుమిత్రులతో కలిసి విందువినోదాలలో పాల్గొంటారు. దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు ప్రేమించే వారి వలన కొంత నష్టపోయే ఆస్కారం ఉంది. ఇతరులకు వాహనం ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించం మంచిదని గమనించండి. స్త్రీల అవసరాలు, కోరికలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. 
 
సింహం: వృత్తి వ్యాపారాల్లో నిలదొక్కుకోవడంతో పాటు ఖాతాదారులను ఆకట్టుకుంటారు. అందరితో సఖ్యతగా మెలుగుతూ మీ పనులు చక్కబెట్టుకుంటారు. అతిధి మర్యాధలు బాగుగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిదికాదు. 
 
కన్య: ఆర్థిక వ్యవహారాలు గోప్యంగా ఉంచడం క్షేమదాయకం. మిమ్ములను చిన్నచూపు చూసిన వారే మీకు దగ్గరయ్యేందుకు యత్నిస్తారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో చికాకులు ఎదుర్కుంటారు. మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు కలిసివస్తుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారలతో ఇబ్బందులు ఎదుర్కుంటారు.
 
తుల: ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ప్రముఖుల కోసం షాపింగ్‌లు చేస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. మీ లక్ష్యసాధనకు కృషి, పట్టుదల ముఖ్యమని గమనించండి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పనివారలతో చికాకులు అధికమవుతాయి. 
 
వృశ్చికం: బంధువుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా చేసుకోవలసి వస్తుంది. దంపతుల మధ్య ఏకాభిప్రాయం సాధ్యం కాదు. మీ సంతానం కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. ఖర్చులు పెరగటంతో కొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. స్త్రీల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. 
 
ధనస్సు: స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. దూర దేశాలు వెళ్ళడానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. అర్థాంతంగా ముగించిన పనులు పునఃప్రారంభిస్తారు. మనస్సుకు నచ్చని సంఘటనలు ఎదురవుతాయి. మీ చుట్టు ప్రక్కల వారితో సంభాషించేటప్పుడు జాగ్రత్త అవసరం.
 
మకరం: ప్రేమికుల తొందరపాటు అనర్థాలకు దారితీస్తుంది. దైవ సేవా కార్యక్రమాల్లో ఆటంకాలు అధికమిస్తాయి. స్త్రీల ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ వాహనం మరమ్మతులకు గురయ్యే ఆస్కారం ఉంది. స్నేహితులతో కలసి ఉల్లాసంగా గడుపుతారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. 
 
కుంభం: చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. క్రీడలపట్ల ఆసక్తి పెరుగుతుంది. రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. కంప్యూటర్ టెక్నికల్, ఎలక్ట్రానికల్ రంగాల్లో వారికి గుర్తింపు లభిస్తుంది. మీ కుటుంబీకుల కోసం మంచి మంచి ప్రణాళికలు వేస్తారు. 
 
మీనం: మందులు, ఆల్కహాల్, నిత్యావసర వస్తు వ్యాపారులకు పురోభివృద్ధి. ఒకే అభిరుచి కలిగిన వ్యక్తుల కలయిక జరుగును. ఊహగానాలతో కాలం వ్యర్ధం చేయక సత్‌కాలంను సద్వినియోగం చేసుకోండి. మీ అశ్రద్ధ ఆలస్యాల వలన కొన్ని చికాకులు ఎదుర్కొనక తప్పదు. విజ్ఞతాయుతంగా వ్యవహరించి మీ గౌరవాన్ని కాపాడుకోండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూలై 08-07-2018 నుండి 14-07-2018 వరకు మీ వార రాశి ఫలితాలు(Video)