Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంగళవారం (03-07-2018) రాశిఫలాలు - విందు వినోద కార్యక్రమాల్లో...

మేషం: కుటుంబీకుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. పూలు, పండ్లు, కొబ్బరి కాయల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యుల గురించి అప్రియమైన వార్తులు వినవలసి వస్తుంది. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండండి

Advertiesment
మంగళవారం (03-07-2018) రాశిఫలాలు - విందు వినోద కార్యక్రమాల్లో...
, మంగళవారం, 3 జులై 2018 (10:52 IST)
మేషం: కుటుంబీకుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. పూలు, పండ్లు, కొబ్బరి కాయల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యుల గురించి అప్రియమైన వార్తులు వినవలసి వస్తుంది. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండండి. విందు వినోద కార్యక్రమాల పట్ల పెద్దలు, పిల్లలు ఆసక్తితో పాల్గొంటారు.
 
వృషభం: కోర్టు వ్యవహారాలు సజావుగా సాగవు. సన్నిహితుల నుండి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ధనం విపరీతంగా వ్యయం అయినా ప్రయోజనకరంగా ఉంటుంది. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. ప్రేమికుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. బంధువుల రాకపోలకు అధికమవుతాయి.
 
మిధునం: ఇతర విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. క్రీడల పట్ల ఆసక్తి పెరుగును. మీ శ్రమకుతగిన ప్రతిఫలం కానవస్తుంది. ఫ్యాన్సీ, కిళ్ళీ, కిరాణా రంగాలలో వారికి చిరువ్యాపారులకు అనుకూలం. పాతసమస్యల నుండి బయటపడుతారు. మీ సంతానం కోసం ఖర్చుచేస్తారు. వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ వహించండి. 
 
కర్కాటకం: సహోద్యోగులతో వాగ్వివాదాలకు దిగకండి. ఉద్యోగులకు సంబంధించిన సమాచారం నిరుత్సాహం కలిగిస్తుంది.  వృత్తిపరమైన ప్రయాణాలు, సరకుల రవాణాలో సమస్యలు తలెత్తుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుతాయి. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. 
 
సింహం: దైవ, పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంట్లో మార్పులు చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకోవడం వలన కొన్ని వ్యవహారాలు మీకు లాభిస్తాయి. ఉద్యోగస్తులు అపరిచితులతో జాగ్రత్తగా ఉండండి. బంధువులను కలుసుకుంటారు. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు.  
 
కన్య: ఆర్థిక లావాదేవీలు ఊహించని విధంగా ఉంటాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. భాగస్వామిక ఒప్పందాలు, ప్రముఖులతో చర్చలు సత్ఫలితాలిస్తాయి. మీ ప్రతిభ వెలుగులోనికి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ప్రతికూలతకు సైతం అనుకూలం. 
 
తుల: అవివాహితులకు అనుకున్న సంబంధాలు నిశ్చయం కావడంతో వారిలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. కాంట్రాక్టులు అగ్రిమెంట్లు ఫలిస్తాయి. విద్యార్థులకు ప్రోత్సాకర సమయం. చిన్నారుల విద్యా విషయాల్లో శుభపరిణామాలు సంభవం. మిమ్మల్ని తక్కువ అంచనా వేసే వారు మీ సహాయం ఆర్థిస్తారు. 
 
వృశ్చికం: పనులను నెమ్మదిగా పూర్తిచేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మీ ప్రతిభ వెలుగులోనికి వస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. వ్యాపారంలోను, వ్యక్తిగత జీవితంలోను ఆనందం నెలకొంటుంది. ఇంటాబయటా మీదే పైచేయి. పనులను సాఫీగా పూర్తిచేస్తారు. 
 
ధనస్సు: కుటుంబీకుల మధ్య పలువిషయాలు చర్చకు వస్తాయి. స్త్రీలకు షాపింగ్ విషయాలలో అప్రమత్తత అవసరం. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. సన్నిహితుల ఆర్థిక విషయాలలో జోక్యం చేసుకోవలసి వస్తుంది. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. 
 
మకరం: వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ప్రయోజనాలు సాధించడం కష్టసాధ్యం. అనుకోని ఖర్చులు తప్పనిసరి చెల్లింపుల వలన స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. మీ శ్రీమతి సలహా పాటించడం వలన ఒక సమస్యనుండి గట్టెక్కుతారు. రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్లకు అనుకూలం. గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. 
 
కుంభం: ఆర్థిక వ్యవహారాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. సోదరీసోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. పై అధికారుల సహకారం లోపిస్తుంది. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబీకుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. సహోద్యోగులతో వ్యక్తిగత విషయాలు చర్చకు వస్తాయి.
 
మీనం: వృత్తిపరమైన ప్రయాణాలు, సరకుల రవాణాలో సమస్యలు తలెత్తుతాయి. అకాలభోజనం, శ్రమాధిక్యత వలన స్వల్ప అస్వస్థతకు గురవుతారు. స్థిరచరాస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. సమయానికి మిత్రులు సహకరించక పోవటంతో అసహానానికి గురవుతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాలభైరవునికి బుధవారం పూజ.. కలకండ, అటుకుల పాయసాన్ని?