Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శుక్రవారం (29-06-2018) దినఫలాలు - అపరిచిత వ్యక్తుల పట్ల...

మేషం: ఆర్థిక, వ్యాపార విషయాలను గోప్యంగా ఉంచండి. ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. నూతన వ్యపారాల్లో నిలదొక్కుకోవడానికి బాగా శ్రమించాలి. రవాణా

webdunia
శుక్రవారం, 29 జూన్ 2018 (09:02 IST)
మేషం: ఆర్థిక, వ్యాపార విషయాలను గోప్యంగా ఉంచండి. ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. నూతన వ్యపారాల్లో నిలదొక్కుకోవడానికి బాగా శ్రమించాలి. రవాణా రంగాల వారికి చికాకులు తప్పవు. విదేశాల నుండి ఊహించని అవకాశాలు లభిస్తాయి.
 
వృషభం: ఉద్యోగస్తులకు ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. కోర్టు వాయిదాలకు హాజరువుతారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. సోదరులతో ఏకీభవించలేకపోతారు.
 
మిధునం: ఇతరుల స్థితిగతులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య నుండి గట్టెక్కుతారు. ఆరోగ్య రీత్యా స్వల్ప ఇబ్బందులెదుర్కుంటారు. భాగస్వాములతో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు. ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. 
 
కర్కాటకం: ఆర్థిక సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. ప్రింటింగ్ రంగాలవారికి బాకీలు వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు ఎదుర్కుంటారు. 
 
సింహం: బంధువుల రాకతో పనులు అసంపూర్తిగా ముగించవలసివస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. మీ కళత్ర మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. కళ్ళు, నడుము నరాలకు సంబంధించి చికాకులను ఎదుర్కుంటారు. 
 
కన్య: తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికిమాటికి అసహనం ఎదుర్కుంటారు. సోదరీసోదరుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు పురోభివృద్ధి. నిరుద్యోగులుకు పోటీ పరీక్షలలో మెళకువ అవసరం. ప్రభుత్వ కార్యలయాల్లో పనులు సానుకూలమవుతాయి. 
 
తుల: మీ కృషికి గుర్తింపు, ప్రతిఫలం లభిస్తుంది. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. మీ పథకాలు, ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. రుణాలు తీర్చటానికై చేయు యత్నాలు ఫలిస్తాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. కొత్త సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
 
వృశ్చికం: గృహిణీలకు పనివారలతో సమస్యలు తలెత్తుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. శత్రువులపై విజయం సాధిస్తారు. రిజిస్ట్రేషన్లు, కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు అనుకూలిస్తాయి. కంది, నూనె, మిర్చి వ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. రాజకీయ కళారంగాల వారికి విదేశీ పర్యటనలు అధికమవుతాయి.  
 
ధనస్సు: విద్యార్థులలో నూతన ఉత్సాహం కానవస్తుంది. మీ లక్ష్యం మంచిదైనా గోప్యంగా ఉంచండి. స్త్రీలు బంధువుల నుండి ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. కుటుంబ సౌఖ్యం, మానసిక ప్రశాంతత పొందుతారు. చేపట్టిన పనులు అర్ధాంతంగా ముగించాల్సి వస్తుంది.
 
మకరం: ఆహార వ్యవహారాల్లో మెళకువ వహించండి. ప్రయాణ రీత్య ధనవ్యయం మానసిక ప్రశాంతత కలుగుతుంది. అధ్యాపకులకు పురోభివృద్ధి. రాజకీయ నాయకులకు కలిసివచ్చును. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపిస్తారు. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.
 
కుంభం: స్త్రీలకు ఆభరణాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. క్లిష్ట సమయంలో బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు, కలహాలు తలెత్తుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. 
 
మీనం: చెప్పుడు మాటల ప్రభావం మీపై అధికంగా ఉంటుంది. ఒకే పని విషయమై అనేక సార్లు తిరగాల్సి వస్తుంది. లౌక్యంగా వ్యవహరించి ఒక సమస్య నుండి గట్టెక్కుతారు. విద్యార్థులకు టెక్నికల్, ఇంజనీరింగ్ కోర్సులలో అవకాశాలు లభిస్తాయి. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది.

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

ఆ మూడు మీలో ఉంటే, మిమ్ముల్ని ఏదీ అడ్డుకోలేదు... స్వామి వివేకానంద