Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బుధవారం (27-06-2018) రాశిఫలాలు - కుటుంబంలో ప్రశాంతత...

మేషం: రిప్రజెంటేటివ్‌లకు తమ టార్గెట్లను అతికష్టంమ్మీద పూర్తిచేస్తారు. బృందా కార్యక్రమాలలో పాల్గొంటారు. మెుండి బాకీల వసూలు కొంత మేరకు వసూలు కాగలవు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం. అప్పుడప్ప

బుధవారం (27-06-2018) రాశిఫలాలు - కుటుంబంలో ప్రశాంతత...
, బుధవారం, 27 జూన్ 2018 (08:24 IST)
మేషం: రిప్రజెంటేటివ్‌లకు తమ టార్గెట్లను అతికష్టంమ్మీద పూర్తిచేస్తారు. బృందా కార్యక్రమాలలో పాల్గొంటారు. మెుండి బాకీల వసూలు కొంత మేరకు వసూలు కాగలవు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం. అప్పుడప్పుడు పెద్దల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తగలవు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది.
 
వృషభం: విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పుడుతాయి. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
మిధునం: బ్యాంకు వ్యహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. స్థిరాస్తి వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో ప్రముఖుల సలహా పాటించడం మంచిది. కుటుంబ విషయాలు, శ్రీమతి వైఖరి చికాకు పరుస్తాయి. 
 
కర్కాటకం: చిన్న చిన్న విషయాలలో ఉద్రేకం మాని ఓర్పు, విజ్ఞతాయుతంగా వ్యవహరించవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్, బదిలీ ఉత్తర్వులు అందుతాయి. రుణాలు, చేబదుళ్లు ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించండి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. 
 
సింహం: ప్రింటింగ్ రంగాల వారికి బాకీలు వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు ఎదుర్కుంటారు. సోదరీసోదరుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. బంధువుల రాకతో పనులు అసంపూర్తిగా ముగించవలసి వస్తుంది. అధికారుల ఇంటర్వ్యూకోసం పడిగాపులు తప్పవు. 
 
కన్య: బంగారు వ్యాపారులకు అనుకోని సమస్యలు ఎదురవుతాయి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం క్షేమం కాదు. విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి. ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. మీ కళత్ర మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
తుల: ఆర్థిక, పెట్టుబడుల గురించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికిమాటికి అసహనం ఎదుర్కుంటారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపడుతారు. మీ విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. 
 
వృశ్చికం: నూతన వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి బాగా శ్రమించాలి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ, ఏకాగ్రత అవసరం. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. కళ్ళు, నడుము నరాలకు సంబంధించి చికాకులను ఎదుర్కుంటారు. 
 
ధనస్సు: బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. కుటుంబ విషయాలు, శ్రీమతి వైఖరి చికాకు పరుస్తుంది. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు. మీ సంతానం విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు.
 
మకరం: సహోద్యోగుల సాయంతో ఒక సమస్య నుండి గట్టెక్కుతారు. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. ఆరోగ్య రీత్యా స్వల్ప ఇబ్బందులెదుర్కుంటారు. భాగస్వాములతో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. వృత్తి వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలమే. 
 
కుంభం: శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత ముఖ్యం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. గృహ మరమ్మత్తులు, మార్పులు అనుకూలిస్తాయి. ఆకస్మిక ఖర్చుల వలన ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. స్థిరచరాస్తుల వ్యవహారంలో పెద్దలసలహా పాటిస్తారు. 
 
మీనం: ఉద్యోగస్తులకు బరువుబాధ్యతలు అధికమవుతాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబీకులు మీ ఇబ్బందులను అర్థం చేసుకుంటారు. ద్విచక్ర వాహనాలపై దూరప్రయాణాలు మంచిది కాదని గమనించండి. కొంతమంది మీట మాటలు ఇతరులకు చేరవేసే ఆస్కారం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శోభనపు గదిలోకి ప్రవేశిస్తూ కిందపడి మరణించాడు... అప్పుడేమైంది?