Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శుక్రవారం (22-06-2018) దినఫలాలు - పెంపుడు జంతువుల విషయంలో....

మేషం: ఆర్థిక సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారిలతో ఇబ్బందులు ఎదుర్కుంటారు. ధనవ్యయం, శ్రమాధిక్యతతో వ్యవహారాలు సానుకూలమవుతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా స

Advertiesment
శుక్రవారం (22-06-2018) దినఫలాలు - పెంపుడు జంతువుల విషయంలో....
, శుక్రవారం, 22 జూన్ 2018 (08:34 IST)
మేషం: ఆర్థిక సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారిలతో ఇబ్బందులు ఎదుర్కుంటారు. ధనవ్యయం, శ్రమాధిక్యతతో వ్యవహారాలు సానుకూలమవుతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. రిప్రజెంట్‌టేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టంమ్మీద పూర్తి చేస్తారు.
 
వృషభం: పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. శ్రమాధిక్యత, అకాల భోజనం వంటి చికాకులు తప్పవు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. మీ హోదా చాటు కోవటానికి ధనం బాగా వ్యయం చేయవలసి వస్తుంది.
 
మిధునం: పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి బాకీల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలను ఎదుర్కుంటారు. అధికారులతో మనస్పర్ధలు తలెత్తుతాయి. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
కర్కాటకం: చిన్నపాటి అనారోగ్యానికి గురై చికిత్న తీసుకోవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రతలోపం వల్ల అధికారులతో మాట పడక తప్పదు. అప్పుడప్పుడు పెద్దల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తగలవు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయ వంతంగా పూర్తి చేస్తారు. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి.
 
సింహం: సోదరుల మధ్య సఖ్యత అంతగా ఉండదు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. ప్రతి చిన్న విషయాలకు ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తగా మెలగవలసి ఉంటుంది. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించడం వల్ల అస్వస్థతకు లోనవుతారు.
 
కన్య: దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వలన మీ కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. స్త్రీల తొందరపాటుతనం వల్ల బంధువర్గాల నుండి మాటపడవలసివస్తుంది. ఉద్యోగ యత్నాలు ముమ్మరం చేస్తారు. చిన్నారులకు అవసరమైన వస్తువులు సేకరిస్తారు. కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
 
తుల: సోదరీసోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగా ఉంటాయి. అప్పుడప్పుడు పెద్దల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తగలవు. బంధుమిత్రులతో ప్రయాణాలు సాగిస్తారు. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. రహస్య విరోధులు అధికం కావడం వలన రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. 
 
వృశ్చికం: ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు వ్యవహరిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. వ్యాపారులకు కావలసిన లైసెన్సులు మంజూరవుతాయి. ఆకస్మిక ఖర్చులు, తప్పనిసరి చెల్లింపులు ఆందోళన కలిగిస్తాయి. మీ రాక బంధుమిత్రులకు సంతోషం కలిగిస్తుంది.
 
ధనస్సు: కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. మీ సంతానం ఉన్నతికోసం బాగా శ్రమిస్తారు. ఉద్యోగస్తులు తోటివారితో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీలకు విలాసవస్తువులు, ఆడంబరాల పట్ల మక్కువ పెరుగుతుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి కర్తవ్య నిర్వహణలో చిన్న చిన్న పొరపాట్లు జరిగే ఆస్కారం ఉంది. 
 
మకరం:  పది మంది సహకారంతో అనుకున్నది సాధిస్తారు. ఇతరుల వాఖ్యాలు మీపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం తప్పవు. ప్రభుత్వ కార్యలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. ధనం చేతిలో నిలబడటం కష్టమే.
 
కుంభం: కోర్టు వ్యవహారాలు వాయిదా పడటంతో నిరుత్సాహం చెందుతారు. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటుంది. ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. బ్యాంకుపనుల్లో ఏకాగ్రత వహించండి. ధనం చేతిలో నిలబడటం కష్టమే.
 
మీనం: మీ చిన్నారుల భవిష్యత్ గురించి తగు శ్రద్ధ తీసుకుంటారు. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి, అందకు పరిస్థితులు అనుకూలిస్తాయి. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. దైవ, సేవా కార్యక్రమాల్లో ప్రముఖంగా వ్యవహరించి అందరినీ మెప్పిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శని దోషాలతో బాధపడేవారు.. నల్ల వంకాయలను..?