Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆదివారం (24-06-18) దినఫలాలు - ఎవరినీ అతిగా విశ్వసించడం...

మేషం: కుటుంబీకులతో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. సోదరీసోదరులతో మనస్పర్థలు తలెత్తుతాయి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. స్త్రీలకు పనివా

webdunia
ఆదివారం, 24 జూన్ 2018 (09:39 IST)
మేషం: కుటుంబీకులతో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. సోదరీసోదరులతో మనస్పర్థలు తలెత్తుతాయి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. స్త్రీలకు పనివారలతో ఇబ్బందులు తప్పవు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కుంటారు.
 
వృషభం: ధనం ఎంత వస్తున్నా నిల్వ చేయలేకపోతారు. ఎవరినీ అతిగా విశ్వసించటం మంచిదికాదు. నిర్వహణలోపం వల్ల వ్యాపార రంగంలోని వారికి సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. మీ కళత్ర మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి అధికమవుతుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు.
 
మిధునం: దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. రుణాలు, చేబదుళ్లు ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించండి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొరవ ఉండదు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. 
 
కర్కాటకం: దంపతుల మధ్య సంతానం విద్యా విషయాలు ప్రస్తావనకు వస్తాయి. అసలైన శక్తిసామర్థ్యన్ని మిమ్మిల్ని పరిపూర్ణ వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. సన్మానాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కుంటారు. తలచిన కార్యక్రమాలు, వ్యవహారాలు సజావుగా సాగుతాయి. 
 
సింహం: వ్యాపారాభివృద్ధికి ఆర్థిక సంస్థల నుండి ఋణం మంజూరవుతుంది. స్త్రీలు అదనపు సంపాదన దిశగా తమ ఆలోచనలు సాగిస్తారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖులను కలుసుకుంటారు. శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహాకారాలు అందిస్తారు. ప్రియతములతో సంబంధ భాంధవ్యాలు బాగుగా ఉంటాయి.
 
కన్య: ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. మీ సంతానం కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. మాట్లాడలేనిచేట మౌనం వహించడం మంచిది. 
 
తుల: ఆకాల భోజనం వల్ల పెద్దల ఆరోగ్యములో ఇబ్బందులు తప్పవు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రముఖులను కలుసుకుంటారు.
 
వృశ్చికం: అనుకున్న పనులు ఆశించినంత చురుకుగా సాగవు. బంధువుల రాకపోకలు చికాకు పరుస్తాయి. విద్యార్థినులకు ఉన్నత విద్యలలో అవకాశం లభిస్తుంది. స్త్రీలకు ఆత్మీయుల కలయిక కొత్త ఉత్సాహాన్నిస్తుంది. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. రియల్ ఎస్టేట్ రంగాలవారికి చికాకులు వంటివి తలెత్తుతాయి. 
 
ధనస్సు: మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు పనిభారం అధికమవుతుంది. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పట్టుదల అధికమవుతుంది. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం కొంత ముందు వెనుకలుగానైనా అందుతుంది. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. 
 
మకరం: పారిశ్రామిక రంగంలోని వారికి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు దక్కుతాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది.
 
కుంభం: మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది.
 
మీనం: కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. ఖర్చులు అదుపుకోకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

జూన్ 24-06-2018 నుంచి 30-06-2018 వరకు మీ రాశి ఫలితాలు(Video)