శనివారం (23-06-18) దినఫలాలు - ధన సహాయం ఏమాత్రం...
మేషం: ముఖ్యుల రాకపోకలు, అనుకోని ఖర్చుల వలన స్వల్ప ఇబ్బందులు తప్పవు. ఉద్యోగస్తులు ఒత్తిడి, ధన ప్రలోభాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. సంఘంలో మంచి గుర్తింపు, ర
మేషం: ముఖ్యుల రాకపోకలు, అనుకోని ఖర్చుల వలన స్వల్ప ఇబ్బందులు తప్పవు. ఉద్యోగస్తులు ఒత్తిడి, ధన ప్రలోభాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఫైనాన్సు, చిట్స్ వాయిదాలు, పన్నులు సకాలంలో చెల్లిస్తారు.
వృషభం: ఆర్థిక పెట్టుబడుల గురించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. స్త్రీలకు షాపింగ్లోను, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. రాజకీయ నాయకులు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఎ.సి. కూలర్ మోకానిక్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. పెద్ద మెుత్తం ధనసహాయం క్షేమం కాదు.
మిధునం: ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. నిరుద్యోగులు ఉపాథి పథకాల్లో రాణిస్తారు. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. స్థిరాస్తి విక్రయించాలన్న మీ ఆలోచన విరమించుకోవటం మంచిది. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు.
కర్కాటకం: యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. కాంట్రాక్టర్లకు నూతమ టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. ముందుచూపుతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాన్నిస్తుంది. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
సింహం: కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. ప్రింటింగ్ రంగాలవారికి బాకీల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. చిన్నారులకు విలువైన కానుకలు అందిస్తారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కవలసి వస్తుంది. భాగస్వామిక ఒప్పందాల్లో మీ నిర్ణయాన్ని కచ్చితంగా తెలియజేయండి.
కన్య: దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని అందరిని ఆకట్టుకుంటారు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. రాజకీయాలలోని వారికి సంఘంలో స్థాయి పెరుగుతుంది. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. పోస్టల్, కొరియల్ రంగాలవారికి ఒత్తిడి, చికాకులు తప్పవు.
తుల: బంధువుల రాకతో గృహంలో కొత్త ఉత్సాహం సందడి చోటుచేసుకుంటాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లు తొలగి పురోభివృద్ధి సాధిస్తారు. ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారలతో ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
వృశ్చికం: వ్యవసాయం, పరిశ్రమల రంగాలవారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వస్తువు కొనుగోలులో నాణ్యత గమనించాలి. మీ యత్నాలకు కుటుంబీకులు సహాయ సహకారాలు అందిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. చిన్ననాటి వ్యక్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది.
ధనస్సు: ఆర్థిక వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధికమిస్తారు. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు వంటి సమస్యలు తప్పవు.
మకరం: అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. రియల్ ఎస్టేట్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. శ్రీమతి, శ్రీవారు మధ్య అనుమానాలు అపోహాలు తలెత్తుతాయి. వ్యవసాయ రంగాలవారికి వాతావరణం అనుకూలిస్తుంది. ప్రేమ విషయంలో కానీ, వృత్తిపరంగా కానీ ఓ త్యాగం చేయాల్సి వస్తుంది.
కుంభం: డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. వ్యాపారాల్లో మెుహమ్మాటాలు, భేషజాలు తగదు. పెండింగ్ పనులు పూర్తి చేయగల్గుతారు. నిరుద్యోగులకు ప్రకటనలు, మధ్యవర్తుల విషయంలో అవగాహన ముఖ్యం. పుణ్యక్షేత్రాలు దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి.
మీనం: బంధుమిత్రుల నుండి ఒత్తిడి, మెుహమ్మాటాలు ఎదుర్కుంటారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, స్వశక్తిపై జీవించాలన్న పట్టుదల అధికమవుతాయి. పాత సంబంధ భాంధవ్యాలు మెరుగుపడుతాయి. స్టాక్ మార్కెట్ రంగాలవారి అంచానాలు ఫలిస్తాయి. జీవనోపాధికి సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన స్పురిస్తుంది.