Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శనివారం (30-06-18) దినఫలాలు - ఏ వ్యక్తికీ అతి చనువు...

మేషం: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఏ వ్యక్తికీ అతి చనుపు ఇవ్వడం మంచిది కాదు. గత విషయాలు జ్ఞాప్తికి రాగలవు. డాక్టర్లు శస్త

Advertiesment
శనివారం (30-06-18) దినఫలాలు - ఏ వ్యక్తికీ అతి చనువు...
, శనివారం, 30 జూన్ 2018 (08:40 IST)
మేషం: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఏ వ్యక్తికీ అతి చనుపు ఇవ్వడం మంచిది కాదు. గత విషయాలు జ్ఞాప్తికి రాగలవు. డాక్టర్లు శస్త్రిచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది.
 
వృషభం: ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. దూరప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
మిధునం: ఆర్థికంగా బాగుగా స్థిరపడుతారు. కొబ్బరి, పండ్ల, పూల, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. గొప్ప గొప్ప ఆలోచనలు, ఆశయాలు స్పురిస్తాయి. కళా, ఫోటోగ్రఫి ఉన్నత విద్య, విదేశ వ్యవహారాల రంగాలవారికి అనుకూల సమయం. రాజకీయ నాయకులకు ప్రజల ఆధరణ అధికంగా ఉంటుంది.
 
కర్కాటకం: ఉద్యోక రీత్యా దూరప్రయాణాలు అనుకూలిస్తాయి. చిన్నారులకు అవసరమైన వస్తువులు సేకరిస్తారు. స్త్రీలకు బంధువర్గాల నుండి వ్యతిరేకత, ఆరోగ్యంలో చికాకులు అధికమవుతాయి. రచయితలకు, పత్రికా రంగంలోవారికి ప్రోత్సాహం కానవస్తుంది. బకీలు వసూళ్ళలో శ్రమ, ప్రయాసలు లెదుర్కుంటారు.
 
సింహం: కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుబాట చేసుకుంటారు. బంధువుల చేయూతతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ట్రాన్స్‌పోర్టు, ఆటోమెుబైల్, మెకానికల్ రంగాలవారికి చికాకులు అధికమవుతాయి. పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు లాభదాయకం. 
 
కన్య: రవాణా రంగాలవారికి చికాకులు తప్పవు. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. రిప్రజెంటేటి‌వ్‌లు తమ టార్గెట్లను అతికష్టంమ్మీద పూర్తిచేస్తారు. శారీరక శ్రమ, మానసిక ఆందోళన వలన స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వ్యాపార వర్గాలవారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. 
 
తుల: వృత్తులవారి శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. ఉద్యోగ యత్నాల్లో సఫలీకృతులవుతారు. రాబడికి మించిన ఖర్చులెదురైనా తట్టుకుంటారు. మీ ఉన్నతిని చూసి ఇతరులు అపోహపడే ఆస్కారం ఉంది. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణపనులలో ఏకాగ్రత ముఖ్యం. మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. 
 
వృశ్చికం: బాకీలు, ఇంటి అద్దెల వసూళ్లో చికాకులు, ప్రయాసలు తప్పవు. ఉద్యోగస్తులకు పెండింగ్ పనులు పూర్తి చేయడంలో సహోద్యోగులు సహకరిస్తారు. విదేశీయ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. దైవ, సేవా, పుణ్య కార్యాలకు ధనం బాగా వెచ్చిస్తారు. పాతమిత్రుల కలయికతో గతఅనుభవాలు జ్ఞాప్తి చేసుకుంటారు.
 
ధనస్సు: వస్త్ర, ఫ్యాన్సీ, గృహోపకరణ వ్యాపారులకు పురోభివృద్ధి. ఒక వ్యవహారం నిమిత్తం న్యాయసలహా స్వీకరిస్తారు. ఆత్మీయుల కలయిక సంతోషం కలిగిస్తుంది. కుటుంబ సౌఖ్యం, వాహన యోగం పొందుతారు. స్త్రీలకు బోగస్ ప్రకటనలు, స్కీముల పట్ల అప్రమత్తత అవసరం. మీ సంతానం ధోరణి అసహనం కలిగిస్తుంది.
 
మకరం: స్త్రీలు ఆభరణాలు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. రావలసిన ధనం అందినా దానికి తగినట్లుగానే ఖర్చులుంటాయి. లోపం వలన ఒత్తిడి, ఆందోళనలు తప్పవు. బంధువుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. ప్రముఖులతో చర్చలు జరుపుతారు.  
 
కుంభం: ఆర్థిక విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తారు. ఏ అవకాశం కలిసిరాక నిరుద్యోగులు ఆందోళన చెందుతారు. మీ శ్రీమతి, శ్రీవారి ఆరోగ్యములో జాగ్రత్త వహిస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. లిటిగేషన్ వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. ప్రత్తి, పొగాకు, స్టాకిస్టులకు ఒత్తిడి, ఆందోళనలు అధికం.
 
మీనం: శాస్త్ర, సాంకేతిక రంగాలవారికి సదవకాశాలు లభిస్తాయి. అనుకున్నది సాధించే వరకు అవిశ్రాంతగా శ్రమిస్తారు. స్త్రీల తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. దంపతుల మధ్య దాపరికం మంచిది కాదు. ప్రియతముల, చిన్నారుల వైఖరి మనస్థాపం కలిగిస్తుంది. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాలజ్ఞానంలో శివుని కంట నీరు- సిద్ధిపేట ఎల్లమ్మ ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంది..?