శుక్రవారం (06-07-2018) దినఫలాలు - వాహన సౌఖ్యం.. పదోన్నతి...

మేషం: రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు ఆందోళన అధికమవుతుంది. బ్యాంకింగ్ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు సంబంధించిన సమాచారం నిరుత్సాహం కలిగిస్తుంది. దూరంలో ఉన్న ప్రియతముల ఆరోగ్యం గురించి ఆందోళ

శుక్రవారం, 6 జులై 2018 (08:36 IST)
మేషం: రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు ఆందోళన అధికమవుతుంది. బ్యాంకింగ్ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు సంబంధించిన సమాచారం నిరుత్సాహం కలిగిస్తుంది. దూరంలో ఉన్న ప్రియతముల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీ సంతానం వైఖరి మనస్తాపం కలిగిస్తుంది.
 
వృషభం: పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు లాభదాయకం. అనుకున్న పనులు ఆశించినంత చురుకుగా సాగవు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించినప్పటికి వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. కార్యదీక్షతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. వాహన సౌఖ్యం, పదోన్నతి వంటి శుభపరిణామాలుంటాయి.    
 
మిధునం: స్త్రీలకు విదేశీ వస్తువులు, అలంకరణలపై ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు షాపింగ్, ప్రయాణాలలో విషయాలలో మెళకువ అవసరం. నూతన పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడతాయి. ప్రైవేటు సంస్థలలోనివారికి ఆత్మనిగ్రహం చాలా అవసరమని గమనించండి. ఉమ్మడి వ్యాపారాలు ఆశించినంత సంతృప్తికరంగా ఉండవు.
 
కర్కాటకం: శ్రీవారు, శ్రీమతి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి. భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. స్త్రీల మాటకు వ్యతిరేకత ఎదురవుతుంది. గృహోపకరణాలకు కావలసిన వస్తువులు సేకరిస్తారు. సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. 
 
సింహం: ఉద్యోగస్తులు మార్పులకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు వ్యవహారాలలో మెళకువ అవసరం. కాంట్రాక్టర్లకు ఒత్తిడి, చికాకులు తప్పవు. ఆలయాలను సందర్శిస్తారు. ప్రియతముల పట్ల, ముఖ్యులపట్ల శ్రద్ధ పెరుగుతుంది. కీలకమైన పత్రాల విషయంలో జాగ్రత్త పాటించాలి. సన్నిహితుల కలయిక అనందం కలిగిస్తుంది. 
 
కన్య: ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై చేయు యత్నాలలో జయం పొందుతారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. శత్రువులు మిత్రులుగా మారుతారు. వాగ్వివాదాలకు దిగి సమస్యలు కొని తెచ్చుకోండి. రావలసిన బాకీలు వసూళ్ళ విషయాలంలో లౌక్యంగా వ్యవహరించండి. ప్రయాణాల్లో కొంత అసౌకర్యం తప్పకపోవచ్చు. 
 
తుల: ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో సంతృప్తి కానవస్తుంది. కొందరికి ఆదర్శప్రాయంగా నిలుస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. పోస్టల్, కొరియల్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. ఫైనాన్స్, చిట్క్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఋణం ఏ కొంతైనా తీర్చటానికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. 
 
వృశ్చికం: చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. చేపట్టిన పనులలో అవాంతరాలు ఎదురైనా మెుండి ధైర్యంతో శ్రమించి పూర్తి చేస్తారు. మీ పై అధికారుల ధోరణిలో మార్పు కనిపిస్తుంది. కీలక నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కుంటారు.
 
ధనస్సు: మీ నిర్లక్ష్యం వలన గృహములో విలువైన వస్తువులు చేజారిపోతాయి. జాగ్రత్త వహించండి. కొబ్బరి, పండ్లు, పూల, పానీయ, చిరు వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. ఉద్యోగస్తులకు బరువు, బాధ్యతలు అధికమవుతాయి. బంధుమిత్రుల రాకపోకలు పెరుగుతాయి. 
 
మకరం: చిన్నారుల విద్య, ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయాల్లో ఖర్చులు అంచనాలు మించుతాయి. విదేశీయానం నిమిత్తం చేస్తున్న యత్నాలలో ఆటంకాలు తొలగిపోతాయి. స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వలన భంగపాటుకు గురవుతారు. ప్రతి విషయంలోను స్వయం శక్తినే నమ్ముకోవడం ఉత్తమం.
 
కుంభం: విద్యార్థులకు గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. ఆరోగ్యం, వృత్తి వ్యాపారాలపై దృష్టి పెడతారు. సమయానికి కావలసిన వస్తువులు కనిపించక విసుగు చెందుతారు. కుటింబీకులతో కలిసి దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులపై ఉంచిన నమ్మకం సన్నగిల్లుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులు పడుతారు.
 
మీనం: వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర, సాంకేతిక రంగాలవారికి ఆశాజనకం. ముఖ్యులతో సంభాషించేటపుడు ఆచి, తూచి వ్యవహరించడం మంచిది. స్త్రీలు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. మీకు ఎదురయ్యే సమస్యలకు మీ స్నేహితులతో చర్చించి వారి సలహా తీసుకోవడం మంచిది.  

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ప్రమిదలో దీప ప్రజ్వలనకు నవగ్రహాలకు సంబంధం వుందా? ఎలా?