Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 2 April 2025
webdunia

బుధవారం (11-07-2018) దినఫలాలు - ప్రియతముల ఆరోగ్యం గురించి ...

మేషం: చిన్నారులు, ప్రియతముల ఆరోగ్యం గురించి శ్రద్ధ చూపిస్తారు. సాహిత్య రంగాలలోని వారికి సంతృప్తి. బంధువుల ఆకస్మిక రాక వలన ఊహించని ఖర్చులు అధికమవుతాయి. పెట్టుబడులకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. ఉమ్మడి ని

Advertiesment
Daily Horoscope
, బుధవారం, 11 జులై 2018 (08:31 IST)
మేషం: చిన్నారులు, ప్రియతముల ఆరోగ్యం గురించి శ్రద్ధ చూపిస్తారు. సాహిత్య రంగాలలోని వారికి సంతృప్తి. బంధువుల ఆకస్మిక రాక వలన ఊహించని ఖర్చులు అధికమవుతాయి. పెట్టుబడులకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. ఉమ్మడి నిధుల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతాయి. స్త్రీల ఆరోగ్యంలో ఆందోళనలు ఎదురవుతాయి.
 
వృషభం: సన్నిహితులకు, ఆత్మీయులకు బహుమతులు అందజేస్తారు. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల అవసరం. దైవ దీక్షాకార్యక్రమంలో పాల్గొంటారు. కోర్టు పనులు, లిటిగేషన్లు పరిష్కారం అవుతాయి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు అనుకూలం. ఉద్యోగ, వ్యాపారాల్లో సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. 
 
మిధునం: వీలయితే కీలకమైన నిర్ణయాలు ఈ రోజుకు వాయిదా వేయండి. టెక్నికల్, వైజ్ఞానిక రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ధనం ఎంత వస్తున్నా ఏమాత్రం నిల్వచేయలేకపోతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. నిరుద్యోగులకు అవకాశం చేజారిపోయే ఆస్కారం ఉంది.
 
కర్కాటకం: రావలసిన బాకీలు వసూలవుతాయి. గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. స్త్రీలు షాపింగ్, విందు వినోదాల్లో ఉల్లాసంగా పాల్గొంటారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. వ్యాపార విస్తరణకు సంబంధించిన అంశాల్లో ప్రతికూలత ఎదురుకావచ్చు. సామూహిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి కనపరుస్తారు. 
 
సింహం: మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆదాయం ఆశించినంతగా ఉండదు. దంపతుల మధ్య కొత్త కొత్త విషయాలు చర్చకు వస్తాయి. స్త్రీలకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది.
 
కన్య: బదిలీలు, మార్పులు, చేర్పులు కొంత అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యుల కోసం షాపింగ్ చేస్తారు. విద్యార్థులకు చదువుల పట్ల ఏకాగ్రత ఎంతో ముఖ్యం. మీ సంతానం విద్యా విషయంపై ప్రముఖులతో చర్చిస్తారు. పండ్లు, పూల, కూరగాయ రంగాలలో వారికి అనుకూలమైన కాలం. ఎంత కష్టమైన పనైనా అవలీలగా పూర్తిచేస్తారు. 
 
తుల: రాజకీయాలలో వారికి అవకాశవాదులు అధికం అవుతున్నారని గమనించండి. విద్యా, వైజ్ఞానిక విషయాల పట్ల ఆసక్తి పెరుగును. మనుష్యుల మనస్థత్వము తెలిసి మసలు కొనుట మంచిది. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. ప్రయాణాల్లో తొందరపాటుతనం అంత మంచిది కాదని గమనించండి. 
 
వృశ్చికం: పెరుగుతున్న ఖర్చులు, ఇతరత్రా అవసరాలు మీ ఆర్థికస్థితికి అవరోధంగా నిలుస్తాయి. వ్యాపారాల్లో కొంత నిరాశ తప్పదు. రాజకీయ, పారిశ్రామిక రంగాలవారికి అన్ని విధాలా యోగదాయకమైన కాలం. రుణాలు, పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిదికాదు. 
 
ధనస్సు: ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. వైవాహిక జీవితంలో అనుకోని చికాకులు తలెత్తుటకు ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. ఆత్మీయులకోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. మీ ఒక అనుభమం మీకెంతో జ్ఞానాన్న ఇస్తుంది. ప్రకటనలు, న్యాయ, బోధనారంగాల వారికి అనుకూలం.  
 
మకరం: పత్రిగా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. మీ బంధువులను సహాయం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. 
 
కుంభం: మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీ మంచి కోరుకునేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువాగ ఉన్నారు. విద్యార్థుల మెుండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. 
 
మీనం: సొంతంగా గాని, భాగస్వామ్యంగా గాని మీరు ఆశించిన విధంగా రాణించలేరు. పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. సాహన ప్రయత్నాలు విరమించండి. దూరప్రయాణాలకై చేయు ప్రయత్నాలు వాయిదా పడును. స్త్రీలు వస్త్రములు, ఆభరణములు వంటి వస్తువులు కొనుగోలు చేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలాంటి వ్యక్తి 1000 పొరపాట్లు చేస్తే ఇలాంటి వ్యక్తి 50 వేలు చేస్తాడు... స్వామి వివేకానంద