Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంగళవారం (10-07-2018) రాశిఫలాలు - సన్నిహితుల కలయిక సాధ్యం...

మేషం: ఆర్థిక పరిస్థితి నిరత్సాహపరుస్తుంది. హోటల్, తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. అపరాలు, ధాన్య స్టాకిస్టులకు మెళకువ అవసరం. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వలన చికాకులు, మందిలింపులు తప్పవు. దైవ

Advertiesment
మంగళవారం (10-07-2018) రాశిఫలాలు - సన్నిహితుల కలయిక సాధ్యం...
, మంగళవారం, 10 జులై 2018 (08:32 IST)
మేషం: ఆర్థిక పరిస్థితి నిరత్సాహపరుస్తుంది. హోటల్, తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. అపరాలు, ధాన్య స్టాకిస్టులకు మెళకువ అవసరం. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వలన చికాకులు, మందిలింపులు తప్పవు. దైవ పుణ్యకార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ వహించండి.
 
వృషభం: పాత మిత్రులను కలుసుకుంటారు. స్థిరాస్తి క్రయవిక్రయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకోవడం వలన కొన్ని వ్యవహారాలు మీకు లాభిస్తాయి. మీ ఆలోచనలు పలువిధాలుగా ఉంటాయి. దైవదర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది.     
 
మిధునం: డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. సన్నిహితుల కలయిక సాధ్యం కాదు. వస్త్రాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరగలవు. గృహోపకరణాలు అమర్చుకుంటారు. మీ సంతానం వైఖరి చికాకు కలిగిస్తుంది. సమయానికి కావలసిన వస్తువులు కలిపిస్తాయి.
 
కర్కాటకం: కొన్ని సమస్యలు చిన్నవే అయిన మనశ్శాంతి దూరం చేస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. రుణవిముక్తులు కావడంతోపాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ వహించండి. 
 
సింహం: ముందుచూపుతో వ్యవహరించడం చాలా మంచిది. మిత్రుల ద్వారా అందిన ఒక సమాచారం మీకు ఆందోళన కలిగిస్తుంది. ఇంటికి అవసరమైన వస్తువులు సమకూర్చుకుంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. మీ మాటతీరు పద్ధతి మార్చుకోవలసి ఉంటుంది. ఉమ్మడి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
 
కన్య: దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తిచేస్తారు. ఉద్యోగాల్లో మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహరుణాలు అడ్వాన్సులు లభిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. స్త్రీలకు బంధువులతో సఖ్యత నెలకొంటుంది. 
 
తుల: ఆర్థికపరమైన సమావేశాలు సత్ఫలితాలిస్తాయి కొత్త పరిచయాల వలన లబ్ది పొందుతారు. ఎప్పటి నుండో వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభమవుతాయి. సన్నిహితుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. ఖర్చులు పెరగటంతో రుణాలు, చేబదుళ్ళు తప్పవు. వ్యాపారాల్లో వెల్లడించటం మంచిది కాదని గమనించండి. 
 
వృశ్చికం: ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిది కాదని గమనించండి. ప్రముఖుల కోసం షాపింగ్‌లు చేస్తారు. మీ కళత్ర వైఖరి మీకు చికాకులను కలిగిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. మీ చుట్టు ప్రక్కల వారితో సంభాషించేటప్పుడు జాగ్రత్త అవసరం.  
 
ధనస్సు: సంఘంలో గుర్తింపు, రాణింపు పొందుతారు. ఏదైనా అమ్మకానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలు వాయిదాపడుట మంచిది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ప్రతిష్టలకు కొంత విఘాతం కలిగే అవకాశం ఉంది. కుటుంబంలోని పెద్దల వైఖరి ఆనందం కలిగిస్తుంది.
 
మకరం: సృజనాత్మకంగా వ్యవహరించినప్పుడు మాత్రమై లక్ష్యసాధన వీలవుతుందని గ్రహించండి. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సన్నిహితుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. శ్రీవారు, శ్రీమతితో ప్రయాణాలు, సంభాషణలు అనుకూలిస్తాయి ఇంటర్వ్యూలు వచ్చినప్పటికి వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు.  
 
కుంభం: హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండండి. వ్యాపారా లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. రాజకీయనాయకులు సభలు, సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యుల గురించి తప్పుడు వార్తలు వినవలసివస్తుంది. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వలన చికాకులు, మందలింపులు తప్పవు.
 
మీనం: మీ కున్న దానితో సంతృప్తి చెందండి. బ్యాంకింగ్ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. స్త్రీలకు స్థిరాస్తి అమర్చుకోవాలి అనే కోరిక స్పురిస్తుంది. మీ ఆలోచనలు, పథకాలు కార్యరూపం దాల్చుతాయి. ఊహించని ఖర్చులు వలన ఇబ్బందులు ఎదుర్కుంటారు. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆషాఢ మాసంలో కర్కాటక రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశిస్తే?