Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుద్ధ పౌర్ణమి.. వైశాఖ పౌర్ణమి పూజ.. దానాలు.. ఇవి కొంటే?

సెల్వి
మంగళవారం, 21 మే 2024 (21:22 IST)
వైశాఖ పౌర్ణమి మే 22వ తేదీ సాయంత్రం 5.42 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు మే 23వ తేదీ సాయంత్రం 6.42 గంటలకు ముగుస్తుంది. తిథి వ్రతం మే 23న మాత్రమే ఆచరిస్తారు. ఈ రోజున శ్రీయంత్రం, బుద్ధుని విగ్రహం, ఇత్తడి ఏనుగు విగ్రహం ఇంటికి తెచ్చుకోవడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి. ఈ రోజు ఇంట్లో బంగారు లేదా వెండి నాణేలను ఉంచడం కూడా శుభప్రదంగా భావిస్తారు. తద్వారా లక్ష్మీదేవికి సంతోషం కలిగి, అనుగ్రహిస్తుందని పండితులు చెబుతున్నారు. 
 
వైశాఖ పూర్ణిమ నాడు ఉపవాసం ఉండడం వల్ల అదృష్టం మరియు ఆరోగ్యం చేకూరుతుందని నమ్ముతారు. ఈ రోజున, విష్ణువు యొక్క అనుగ్రహం పొందడానికి సత్య నారాయణ పూజను నిర్వహిస్తారు. అదనంగా, భక్తులు ఈ రోజు ధర్మరాజును కూడా పూజిస్తారు. 
 
శ్రీకృష్ణుడు తన స్నేహితుడైన సుదామను వైశాఖ పూర్ణిమ నాడు ఉపవాసం పాటించమని చెప్పినట్లు విశ్వాసం. తద్వారా సంపదను పొందాడని నమ్మకం. ఈ రోజున బ్రాహ్మణుడికి నీటితో నింపిన కుండను దానం చేస్తారు. కొందరు వైశాఖ పూర్ణిమ నాడు పంచదార, నువ్వులు దానం చేస్తే పాపాలు హరించుకుపోతాయని పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ... రూ.కోటి చెక్కును అందజేసిన డిప్యూటీ సీఎం

విజయవంతంగా బుడమేరు గండ్లు పూడ్చివేత (Video)

సునీత విలియమ్స్ - బచ్ విల్మెర్ పరిస్థితేంటి : వీరు లేకుండానే కదిలిన ఆస్ట్రోనాట్ క్యాప్సుల్

రూ.33 కోట్లు దారి మళ్లించిన స్విగ్గీ మాజీ ఉద్యోగి!

అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకుండా సైలెంట్‌గా సైనెడ్‌తో చంపేసే లేడీ కిల్లర్స్!!

అన్నీ చూడండి

లేటెస్ట్

వినాయక చవితి రోజు.. కొబ్బరి నూనె వేసి జిల్లేడు వత్తులతో..?

06-09-2024 శుక్రవారం రాశిఫలాలు - మీ కష్టం ఫలిస్తుంది.. ఉల్లాసంగా గడుపుతారు...

వినాయక చవితి 2024: 21 పత్రాలు.. ఎరుపు రంగు దుస్తులు..?

నవీ ముంబైలోని ఉల్వేలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం

05-09-2024 గురువారం దినఫలితాలు - ఆ రాశివారికి ఖర్చులు సామాన్యం..

తర్వాతి కథనం
Show comments