Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

Advertiesment
prashanth kishore

ఐవీఆర్

, సోమవారం, 20 మే 2024 (19:12 IST)
తనకు తెలిసినంతవరకూ ఇప్పటిదాకా ఎన్నికల్లో ఒకవైపు భారీ పరాజయం చవిచూస్తున్నా తాము ఓడిపోతున్నామని అంగీకరించిన రాజకీయ నాయకులను ఇప్పటివరకూ చూడలేదన్నారు. నాలుగు రౌండ్లు లెక్కింపు పూర్తయిన తర్వాత ప్రత్యర్థికి భారీ మెజారిటీ వస్తూ కళ్లకు స్పష్టంగా కనిపిస్తున్నా కూడా చివరి రౌండు వరకూ వేచి చూడండి అంటుంటారు హహ్హహ్హ అంటూ నవ్వుతూ చెప్పారు ప్రశాంత్ కిషోర్.
 
ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 175 సీట్లకి 175 గెలుస్తామని చెబుతున్నట్లుగానే రాహుల్ గాంధీ, అమిత్ షా కూడా చెబుతున్నారనీ, గత పదేళ్లుగా నాయకులు ఇలా చెబుతుండటాన్ని చూస్తూనే వున్నానన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గెలుస్తామని మాత్రమే చెప్పారనీ, ఐతే జగన్ మాత్రం గతంలో కంటే ఎక్కువ సీట్లు... అంటే 151కి మించి అని అంటున్నారన్నారు. ఇలాంటి చర్చలకు ఎంతమాత్రం అంతుచిక్కదని చెప్పుకొచ్చారు. మోదీ పాలనపై ప్రజలకు అసంతృప్తి వున్నది కానీ ఆగ్రహం లేదని అభిప్రాయపడిన ప్రశాంత్ కిషోర్, ఈ దఫా కూడా ఎన్డీయే అధికారంలోకి వస్తుందని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించిన రిలయన్స్ రిటైల్ యూస్టా: ప్రారంభించిన నటి శ్రీలీల