ఆకస్మిక గుండెపోట్లపై నాట్స్ అవగాహన సదస్సు

Webdunia
సోమవారం, 27 మార్చి 2023 (19:01 IST)
ఆకస్మిక గుండెపోటుతో యువకుల సైతం చనిపోతుండటంతో ఈ అంశంపై అవగాహన కల్పించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అంతర్జాల వేదికగా వెబినార్ నిర్వహించింది. అమెరికాలోని ప్రముఖ కార్డియాలజిస్ట్ గుడిపాటి చలపతిరావు ఈ సదస్సులో ప్రధానంగా అసలు ఆకస్మిక గుండెపోట్లు ఎందుకు వస్తాయనే దానిపై అవగాహన కల్పించారు. జీవన శైలిలో మార్పులు గుండెపోట్లకు ప్రధాన కారణమని తెలిపారు. మనం తినే ఆహారం సరిగా లేకపోవడం, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం.. వారసత్వంగా వచ్చే వ్యాధుల వల్ల గుండెపోట్లు పెరుగుతున్నాయని.. ముఖ్యంగా భారత్‌లో ఈ పెరుగుదల ఎక్కువగా ఉందని గుడిపాటి చలపతిరావు అంకెలతో సహా వివరించారు.
 
జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకుంటే ఆకస్మిక గుండెపోట్ల నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిదన్నారు. పైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని ప్రముఖ డాక్టర్ మధు కొర్రపాటి తెలిపారు. పెరుగన్నం, చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. తెల్ల అన్నానికి బదులుగా మిలెట్స్, ఓట్స్, బ్రౌన్ రైస్‌లాంటివి వాడొచ్చని తెలిపారు. కూరగాయలు, పండ్లు ఆహారంలో ఎక్కువగా ఉండాలని.. రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలని మధు కొర్రపాటి సూచించారు.
 
గుండెపోటు వచ్చినప్పుడు చుట్టుపక్కన ఉండేవాళ్లు ఎలా స్పందించాలి అనేది డాక్టర్ మాధురి అడబాల వివరించారు. సీపీఆర్ ఎలా చేయాలనే దానిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి విజయ్ అన్నపరెడ్డి వ్యాఖ్యతగా వ్యవహరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో డాక్టర్ పూర్ణ అట్లూరి గుండెపోటు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. ఈ కార్యక్రమ నిర్వహణలో డాక్టర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ గంటి సూర్యం, డాక్టర్ బీఎస్ఆర్ మూర్తి, డాక్టర్ దాసరి సతీష్‌లు కీలక పాత్ర పోషించారు.
 
టీఏజీడీవీ, టీఎఫ్ఏఎస్, టామ్, వాషింగ్టన్ తెలుగు సోసైటీ, టాంటెక్స్, ఉజ్వల ఫౌండేషన్, సహృదయ ఫౌండేషన్, జింకానా రన్ ఇన్ ఇండియా, హిందు అమెరికన్ సోసైటీ ఆఫ్ సెంట్రల్ న్యూజెర్సీ తదితర సంస్థలు ఈ కార్యక్రమానికి తమ పూర్తి మద్దతు, సహకారాన్ని అందించాయి. డాక్టర్స్ ఫార్మసీ ఈ కార్యక్రమ నిర్వహణకు ప్రధాన స్పానర్‌గా వ్యవహరించింది. ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయుక్తమైన సదస్సును దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హార్మూజ్ జలసంధిని తెరిచారు: పిచ్చిపట్టినట్లు చమురు నౌకలు పరుగులు, ఒక్కరోజే 1.9 కోట్ల బ్యారెళ్లు

భాస్కర్ వర్మ సేతు బ్రిడ్జిపై భార్య బర్త్ డే వేడుకలు.. గౌహతి వ్యాపారవేత్త అరెస్ట్ (video)

రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం వ్యాన్ డ్రైవర్.. ఎక్కడ? (video)

ప్రజల కోసం సీఎం విజయ్ నటి త్రిషను పక్కన పెట్టేసారా? అన్‌ఫాలో చేసిన చెన్నై బ్యూటీ

ప్రియుడితో తిరగడాన్ని అడ్డు చెప్పారని తల్లిదండ్రులను, చెల్లిని హత్య చేసిన యువతి పరార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha: అభిమానులు గోల చేసాక విజయ్‌కు విషెస్ చెప్పిన త్రిష

Ramcharan and modi: న్యూఢిల్లీలో రిపబ్లిక్ సమ్మిట్‌లో మోదీతో రామ్ చరణ్, అనిల్ కపూర్

Manchu Lakshmi: క్రియేటర్స్ కు ఇన్ఫ్లుయెన్సర్స్ కు మధ్య తేడా ఉంది :మంచు లక్ష్మి

సినిమా అనేది చౌకైన వినోద సాధనం, పాప్‌కార్న్, స్నాక్స్ ధరలు తగ్గితే? చెర్రీ

సెన్సార్ తో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, రోజు రోజుకూ కలెక్లన్లు పెరుగుతున్నాయి : దీవాన నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments