హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూపార్కులో ఉండే చీతాకు గుండెపోటు వచ్చింది. దీంతో అది కన్నుమూసింది. గత 11 సంవత్సరాలుగా సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వచ్చిన మగ చీతా అబ్దుల్లా(15) మృత్యువాతపడటంతో అధికారులు పోస్టుమార్టం నిర్వహించి, గుండెపోటుకు గురైనట్లు నిర్ధారించారు.
ప్రస్తుతం దక్షిణ భారతంలో మైసూర్‌తోపాటు నెహ్రూ జూలోనే చీతాలు ఉన్నాయి. 2011లో సౌదీ రాజ కుటుంబీకులు జూను సందర్శించి, జూ నిర్వహణకు ముగ్ధులై 2012లో ఒక జత ఆడ, మగ చీతాలను జూకు పంపించారు. అప్పుడు వీటి వయసు నాలుగేళ్లు. ఆడ చీతా పన్నెండేళ్ల ప్రాయంలో (2020లో) అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి జూలో అబ్దుల్లా ఒంటరిగా ఉంటోంది. అబ్దుల్లా మరణంతో ప్రస్తుతం జూలో చీతాలు లేకుండా పోయాయి.