Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలీవుడ్ లో బలమైన పాత్ర రాలేదు, దసరాతో అక్కడ చేరువవుతా : కీర్తి సురేష్

Keerthy Suresh
శనివారం, 25 మార్చి 2023 (19:11 IST)
Keerthy Suresh
నాని మాసియస్ట్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘దసరా’ దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్  వచ్చింది. దసరా ట్రైలర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూ సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచింది. కీర్తి సురేష్ కథానాయికగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో కీర్తి సురేష్ విలేఖరు సమావేశంలో దసరా విశేషాలని పంచుకున్నారు. 
 
దసరాలో మీ పాత్ర సవాల్ తో కూడుకున్నదిగా అనిపిస్తోంది. మేకప్ కూడా డార్క్ గా వుంది. మీ పాత్ర గురించి  ?
దసరాలో సవాల్ తో కూడుకున్న పాత్ర చేశా. మేకప్ వేయడానికి, తీయడానికి కూడా కొన్ని గంటలు పట్టేది. దుమ్ము , బొగ్గు ఇలా రస్టిక్ బ్యాగ్ డ్రాప్ లో షూట్ చేశాం. తెలంగాణ యాస మాట్లాడే పాత్ర. మొదట కష్టం అనిపించిది. తర్వాత అలవాటైపోయింది. ఇందులో నా పాత్ర పేరు వెన్నెల. నా కెరీర్ లో పోషించిన ఓ ఛాలెజింగ్ రోల్ ఇది. వెన్నెల అనే పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుంది. 
 
తెలంగాణ యాస మాట్లాడటం ఎలా అనిపించింది ? 
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అసోషియేట్ శ్రీనాథ్ నాకు తెలంగాణ యాస నేర్పించారు. ఆయనకి మొత్తం యాస మీద పట్టుంది. అలాగే ఒక ప్రోఫెషర్ కూడా వున్నారు. చాలా చిన్న చిన్న వివరాలు కూడా యాడ్ చేశారు. దసరాకి నేనే డబ్బింగ్ చెప్పా. మాములుగా అయితే రెండు లేదా మూడు రోజులు డబ్బింగ్ చెబుతా. కానీ దసరాకి మాత్రం ఐదారురోజులు పట్టింది.
 
దసరా చేస్తున్నుడు మహానటి వైబ్స్ వచ్చాయని అన్నారు కదా ? ఏ రకంగా మహానటి గుర్తు వచ్చింది ? 
ఒక సినిమాతో ఒక ఫీల్ వుంటుంది. సినిమా పూర్తి చేసిన తర్వాత కూడా దానితో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఫీలౌతాం. అది మహానటికి వుండేది. ఇప్పుడు దసరాకి  వచ్చింది.  
 
‘మహానటి’కి జాతీయ అవార్డ్ వచ్చింది కదా.. దసరాకి కూడా వస్తుందని భావిస్తున్నారా ?
నేనేం ఆశించడం లేదండీ. నిజానికి మహానటి కూడ నేను ఆశించలేదు. అందరి బ్లెసింగ్స్ తో వచ్చింది. సినిమా బాగా ఆడాలి, అందరూ వారి బెస్ట్ వర్క్ ని ఇవ్వాలని మాత్రమే అనుకుంటాను.
 
దసరాకి ఎలాంటి హోం వర్క్ చేశారు ? 
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ కథని అద్భుతంగా రాసుకున్నారు. ఏ పాత్ర ఎలా ఉండాలో అయనకి చాలా క్లారిటీ వుంది. దర్శకుడు పాత్ర, కథని ఒక మీటర్ లో అనుకుంటారు. ఆ మీటర్ ని అర్ధం చేసుకున్న తర్వాత నేను ఎలా చేయాలనిఅనుకుంటున్నాను.. దర్శకుడు ఏం కోరుకుంటున్నారు .. దాన్ని అర్ధం చేసుకొని క్యారెక్టర్ ని ఎలా బిల్డ్ చేయాలనే దానిపై వర్క్ చేశాం.
 
చమ్కీల అంగీలేసుకొని పాట చాలా పాపులర్ అయ్యింది కదా.. ఇంత పాపులర్ అవుతుందని ముందే అనుకున్నారా ? 
ఆ పాట వినగానే అన్ని పెళ్లిల్లో ఇదే పాట మారుమ్రోగుతుందని అనుకున్నాం. పాటలో ఆ వైబ్ వుంది. లిరిక్స్ చాలా అందంగా వుంటాయి. అప్పుడే పెద్ద హిట్ అవుతుందని అనుకున్నాం. మేము ఊహించిన దాని కంటే పెద్ద విజయం సాధించింది. 
 
మహానటి తర్వాత మీరు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ మీరు వెళ్ళలేదు. దసరా ఇప్పుడు పాన్ ఇండియా విడుదల అవుతుంది కదా ? దిని గురించి ? 
 కొన్ని కథలు విన్నాను. కానీ బలమైన పాత్ర అనిపించలేదు. ఇప్పుడు దసరా పాన్ ఇండియా విడుదలౌతుంది కాబట్టి బలమైన పాత్రలు వస్తాయో చూడాలి. నాకు మాత్రం చేయాలనే వుంది. అయితే ముందు మంచి పాత్రలు, కథలు కుదరాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంచు సోదరుల గొడవలు సద్దుమణిగాయి.. ట్వీట్ వైరల్