Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెలివరీ బాయ్‌గా అవతారమెత్తిన జొమాటో సీఈవో.. చేదు అనుభవంతో..

ఠాగూర్
సోమవారం, 7 అక్టోబరు 2024 (12:50 IST)
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ అధినేత దీపిందర్ గోయల్ ఫుడ్ డెలివరీ బాయ్‌గా అవతారమెత్తారు. అయితే, ఓ మాల్‌లో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. జొమాటో కిట్‌తో మాల్‌లోకి వెళ్లేందుకు సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు. దీంతో ఆయన మెట్లు ఎక్కి ఆర్డర్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 
 
విధుల్లో ఉండగా తన డెలివరీ ఏజెంట్లకు ఎదురవుతున్న సమస్యలు, పరిస్థితులను స్వయంగా తెలుసుకునేందుకు ఆయన స్వయంగా డెలివరీ బాయ్ అవతారమెత్తాడు. ఆ సమయంలో ఓ మాల్‌లో ఆర్డర్ కలెక్ట్ చేసుకునేందుకు వెళ్ళిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. దాని గురించి చెప్తూ ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. 
 
రెండో ఆర్డర్‌ను తీసుకునేందుకు మాల్‌లోకి వెళ్లేందుకు యత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారని దీపిందర్ గోయల్ వెల్లడించారు. తనను మెట్ల మార్గంలో వెళ్లమని సూచించారని తెలిపారు. డెలివరీ బాయ్స్‌ సంక్షేమం దృష్ట్యా మాల్స్‌తో కలిసి జొమాటో మరింత దగ్గరగా పని చేయాల్సి ఉందనే విషయం ఈ ఘటన ద్వారా అర్థమైందని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments