Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గ్యాస్ డెలివరీ బాయ్ నివాసంలో ఎస్సీ విద్యార్థిని అనుమానాస్పద మృతి!!

Advertiesment
girl student

వరుణ్

, మంగళవారం, 16 జులై 2024 (11:00 IST)
గుంటూరు జిల్లా చేబ్రోలులో కొత్త రెడ్డిపాలేంలో ఎనిమిదో తరగతి చదువుకునే బాలిక ఒకరు అనుమానాస్పదంగా మృతి చెందారు. స్థానిక గ్యాస్ డెలివరీ బాయ్ ఇంటిలో విగతజీవితా పడివుండటాన్ని గుర్తించిన కుటుంబీకులు తల్లడిల్లీపోయారు. ఆమె మెడపై గాయాలు కనబడటంతో హత్యకు గురై ఉండొచ్చని భావిస్తున్నారు. 
 
శైలజ, ఆమె అన్నయ్య సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లారు. బడి ముగియగానే బాలుడొక్కడే ఇంటికి తిరిగివచ్చాడు. చెల్లి ఏదని తల్లి ప్రశ్నించటంతో వెంటనే ఆ బాలుడు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులను అడిగాడు. ఒంట్లో బాగోలేదని మీ చెల్లి మధ్యాహ్నం వెళ్లిపోయినట్లు వారు చెప్పారు. దీంతో తల్లీ కుమారుడు కలిసి ఊళ్లో వెతికారు. 
 
ఆ క్రమంలో గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు ఇంటి వద్ద చెల్లెలి చెప్పులు ఉండటాన్ని బాలిక అన్న గుర్తించాడు. కిటికీలో నుంచి చూస్తే చెల్లెలు మంచంపై విగతజీవిగా కనిపించింది. విషయాన్ని కుటుం బసభ్యులకు చెప్పడంతో వారు ఇంటి తాళం పగలగొట్టి, బాలికను బయటకు తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలికను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. 
 
ఆసుపత్రి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న బంధువులు బాలిక మృతికి బాధ్యులను కఠినంగా శిక్షించాలని, ఆమెను ఒంటరిగా బయటకు పంపిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాగరాజుకు పెళ్లయినా.. మూడేళ్లుగా ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నాడని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. బాలిక తల్లిదండ్రులు నాగరాజుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నంద్యాల మైనర్ బాలిక కుటుంబానికి రూ.10లక్షల నష్టపరిహారం