Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లోన్ యాప్ రుణం తీర్చేందుకు కిడ్నీ అమ్ముకున్న ఆటో డ్రైవర్... రూ.లక్ష చేతిలో పెట్టి మోసం చేసిన వైద్యులు!! (Video)

auto driver

వరుణ్

, మంగళవారం, 9 జులై 2024 (11:48 IST)
ఒక లోన్ యాప్‌లో తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించేందుకు ఓ ఆటో డ్రైవర్ కిడ్నీని మూడు లక్షల రూపాయలకు అమ్ముకున్నాడు. ఆపరేషన్ చేసి కిడ్నీని తీసిన ఆస్పత్రి వైద్యులు మాత్రం రూ.లక్ష చేతిలో పెట్టి మోసం చేశారు. ఈ సంఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరుకు చెందిన 31 ఏళ్ళ డ్రైవర్ లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నాడు. తీసుకున్న మొత్తాన్ని నిర్ణీత సమయంలోగా చెల్లించేశాడు. అయితే, రుణం ఇంకా తీరలేదని, మిగతా మొత్తం వెంటనే చెల్లించాలని యాప్ నిర్వాహకులు వేధింపులకు దిగారు. ఈ క్రమంలోనే కిడ్నీ దానం చేస్తే రూ.30 లక్షలు ఇస్తామంటూ ఫేస్‌బుక్‌లో ఓ యాడ్ కనిపించింది. 
 
అందులోని ఫోన్ నెంబర్‌ను సంప్రదించగా.. విజయవాడలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లి, ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి కిడ్నీ తీసుకున్నారు. ఆ తర్వాత డబ్బులు అడిగితే నెలల పాటు తిప్పించుకుని 7 నెలల తర్వాత రూ.లక్ష చేతిలో పెట్టారని ఆటోడ్రైవర్ ఆవేదన వ్యక్తంచేశాడు. మరోవైపు, లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు రోజురోజుకూ పెరుగుతున్నాయని, ఇటు ఏజెంట్లు మోసం చేశారని కన్నీటిపర్యంతమయ్యాడు. ఆ ఆటో డ్రైవర్‌ బోరున విలపిస్తూ తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెపోలియన్ ఆత్మహత్య చేసుకునేందుకు ఉపయోగించిన పిస్తోళ్లకు భారీ ధర!!