Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యువతిని కలిసిన వ్యక్తిని బెదిరించి రూ.60 వేలు దోచుకున్న దుండుగులు..

Cash

ఠాగూర్

, శుక్రవారం, 10 మే 2024 (10:34 IST)
డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన యువతిని కలిసిన వ్యక్తిని దుండగులు భయపెట్టి రూ.60 వేలతో పరారైన ఘటన ఒకటి ఫిల్మ్ నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. విజయ్ నగర్ కాలనీకి చెందిన అజిత్ కె ఇమ్మాన్యుయెల్ ఈ నెల6వ తేదీన మసాజ్ రిపబ్లిక్ అనే డిటింగ్ యాప్ చూసి వాట్సాప్ దారా ఓ యువతితో చాటింగ్ చేశాడు. అదేరోజు సాయంత్రం గోల్గొండ ప్రాంతానికి యువతిని కలిసేందుకు కారులో వెళ్లాడు. ఆ తర్వాత ఇద్దరూ కారులో వెళ్దామనుకుంటుండగా ముగ్గురు వచ్చి కారులో ఎక్కారు. ఇంతలో యువతి జారుకుంది. 
 
మీరు వ్యభిచారానికి వచ్చారు.. కదా అంటూ అతడిని బెదిరించారు. పోలీసుల వద్దకు తీసుకెళ్తామని కేసులు నమోదు చేయిస్తామని, మీడియాకు తెలియజేసి బండారం బహిర్గతం చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో భయపడిపోయిన ఆ జంట... తమను వదిలివేయాలంటూ ప్రాధేయపడటంతో రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఇక చేసేదేం లేక తన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.60 వేల నగదును వారి క్యూఆర్ కోడ్‌కు స్కాన్ ద్వారా బదిలీ చేయించుకుని అతని కారులోనే మణికొండవైపు ప్రయాణించి రోడ్డు పక్కన ఆపి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యతో గొడవలు.. ఇక చాలంటూ భర్త ఉరేసుకుని ఆత్మహత్య