Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ బతుకంతా ఫేక్ ప్రచారమే.. తిట్టాలన్నా మాకు సిగ్గుగా ఉంది : వైకాపాకు టీడీపీ కౌంటర్

Advertiesment
tdp office

వరుణ్

, సోమవారం, 24 జూన్ 2024 (13:35 IST)
గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని హైకోర్టు ఆదేశాలతో రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ ఒకరిపై ఒకరు విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ తాజాగా చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అరండల్ పేట తెలుగుదేశం పార్టీ ఆఫీస్ విషయమై వైసీపీ చేసిన ట్వీట్‌కు టీడీపీ గట్టి కౌంటర్ ఇచ్చింది.
 
ముందు వైకాపా అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఓ ట్వీట్ చేస్తూ, 'గుంటూరు అరండల్ పేటలో 2015లో కబ్జా చేసిన స్థలంలో టీడీపీ కట్టుకున్న పూరి గుడిసె. వెయ్యి గజాల స్థలాన్ని కార్పొరేషన్ నుంచి లీజుకు తీసుకుని అదనంగా పక్కనే ఉన్న మరో 1,500 గజాల స్థలాన్ని ఆక్రమించి ఈ పూరి గుడిసెను నిర్మించారు. మున్సిపల్ స్థలంలో లీజుకి ఇచ్చే పరిస్థితి లేకపోయినా చంద్రబాబు బలవంతంగా ఈ భూమి లీజుకు తీసుకున్నారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి కౌన్సిల్లో తీర్మానం చేసి ఆక్రమించిన స్థలంతో కలిపి 2,500 గజాల స్థలాన్ని క్రమబద్ధీకరించుకొని కార్యాలయాన్ని కట్టేశారు. ఇలాంటి భూములు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కాజేశారు' అని ట్వీట్ చేసింది. 
 
దీనికి టీడీపీ గట్టిగా కౌంటరిచ్చింది. 'ఇలాంటి ఫేక్ చేస్తేనే క్రికెట్ టీం నంబర్ వచ్చింది. అయినా మారకపోతే, సింగిల్స్ ఆడే షటిల్ టీం నంబర్ ఇస్తారు ప్రజలు. అరండల్ పేట తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌ను గత 1998లో నాటి గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు యడ్లపాటి వెంకట్రావు కట్టారు. 1998లో ఆఫీసు కడితే 2015 అని ఫేక్ చేస్తున్నావ్. సిగ్గు లేకుండా వెయ్యి కోట్ల ప్రజా ధనంతో జిల్లాకి ఒక ప్యాలెస్ కడుతూ సమర్ధించుకుంటున్నావు. నిన్ను తిట్టాలన్నా మాకు సిగ్గు వేస్తుంది'అంటూ టీడీపీ ట్వీట్ చేసింది. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హజ్ యాత్రలో విషాదం.. ఈ యేడాదిలో 1301 మంది మృత్యువాత!!