Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోన్ యాప్‌ల జోలికి వెళ్లవద్దు.. డబ్బులు కట్టేసినా.. యువకుడి..?

Webdunia
బుధవారం, 26 జులై 2023 (10:48 IST)
ఆన్‌లైన్‌లో లోన్ యాప్‌ల మోసం రోజు రోజుకీ పెరిగిపోతోంది. లోన్ యాప్‌ల జోలికి వెళ్తే.. నిజాయితీగా డబ్బులు కట్టేసినా వారికి కష్టాలు తప్పవు అనే దానికి ఈ ఘటనే నిదర్శనం. తమిళనాడు తిరువారూరు జిల్లాలో ఆన్‌లైన్‌లో రుణం తీసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
 
వివరాల్లోకి వెళితే.. తిరువారూరు జిల్లా వలంగైమాన్‌కు చెందిన రాజేష్ అనే యువకుడు ఆన్‌లైన్ దరఖాస్తు ద్వారా రుణం తీసుకున్నాడు. అయితే సకాలంలో రుణం చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే.. మళ్లీ డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరించిన లోన్ కంపెనీ.. రాజేష్ న్యూడ్ ఫోటోను మార్ఫింగ్ చేసి అతడి బంధువులు, స్నేహితులకు పంపినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాజేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
అవమానం తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో తేలింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments