Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొడుకు చదువు ఫీజు కోసం తల్లి ప్రాణత్యాగం

woman suicide
, మంగళవారం, 18 జులై 2023 (15:22 IST)
తమిళనాడు రాష్ట్రంలో విషాదకర ఘటన జరిగింది. కొడుకు చదువు కోసం ఓ తల్లి ప్రాణత్యాగం చేసింది. ఉన్నత చదువు కోసం ఫీజు చెల్లించేందుకు ఆ తర్లి వద్ద డబ్బులు లేకపోవడంతో ఈ దారుణానికి పాల్పడింది. ఏదేని ప్రమాదంలో చనిపోతే ప్రభుత్వం రూ.45 వేల ఆర్థికసాయం చేస్తుందని ఎవరో చెప్పిన మాటలు నమ్మిన ఆమె వేగంగా వస్తున్న బస్సుకు అడ్డంగా నిలపడింది. దీంతో ఆమెను బస్సు బలంగా ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో జరిగింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో నెటిజన్లను కన్నీరు పెట్టిస్తోంది. 
 
సేలం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పాపాతి (45) పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. భర్త నుంచి విడిపోయి పిల్లలను ఒంటరిగా పెంచుకుంటోంది. పారిశుద్ధ్య కార్మికురాలిగా తనకు వచ్చే వేతనం ఖర్చులకే సరిపోకపోవడంతో కొడుకు కాలేజీ ఫీజు కట్టడం పాపాతికి భారంగా మారింది. ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న పాపాతి కొడుకు కాలేజీ ఫీజు కట్టడానికి అప్పు కోసం ప్రయత్నించి విఫలమైంది. ఈ క్రమంలోనే బస్సు కింద పడి చనిపోతే ప్రభుత్వం రూ.45 వేల నష్ట పరిహారం ఇస్తుందని ఎవరో పాపాతిని తప్పుదోవ పట్టించినట్లు తెలుస్తోంది.
 
దీంతో కొడుకు ప్రయోజకుడిగా ఎదగాలని, అందుకు తను చనిపోవాలని తీవ్ర నిర్ణయం తీసుకుంది. రోడ్డు దాటుతున్నట్లు నటిస్తూ వేగంగా వస్తున్న బస్సుకు ఎదురువెళ్లింది. బస్సు ఢీ కొనడంతో రోడ్డు మీద ఎగిరిపడింది. తీవ్రగాయాల కారణంగా పాపాతి అక్కడికక్కడే చనిపోయింది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. బస్సు కింద పడడానికి పాపాతి రెండుసార్లు ప్రయత్నించింది. మొదటిసారి బస్సు కింద పడేందుకు ప్రయత్నించగా ఓ ద్విచక్ర వాహనం ఆమెను ఢీ కొట్టింది. తర్వాత కాసేపటికి మళ్లీ బస్సుకు ఎదురువెళ్లింది. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రధానమంత్రి పదవిపై ఆసక్తి లేదు : మల్లికార్జున ఖర్గే