Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేప తెచ్చిన గొడవ.. యువకుడి దారుణ హత్య

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (11:04 IST)
మహారాష్ట్రలోని థానే జిల్లాలో డొంబివిలిలో ఓ దారుణం జరిగింది. చేపనను విక్రయించడంలో ఏర్పడిన గొడవ ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. ఈ కేసులో బంధువును హత్య చేసిన 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నిందితుడు హితేష్‌ సంజయ్ నఖ్వాల్‌ తన బంధువైన భానుదాస్‌ అలియాస్‌ ముకుంద్‌ దత్త చౌదరి (55)తో చేపను విక్రయించే విషయంపై శనివారం గొడవపడ్డాడు. 
 
దీంతో తన బంధువును డోంబివిలీ పట్టణంలోని ఖంబల్‌పాడలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి హితేష్... పదునైన ఆయుధంతో అతని మెడపై దాడి హత్య చేసినట్టు పోలీసులు విచారణలో వెల్లడైంది. 
 
పోస్టుమార్టం నిమిత్తం భానుదాస్‌ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) సెక్షన్‌ 302 కింద కేసు నమోదు చేయబడింది. నిందితుడిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి జైలుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

బరోజ్ 3డీ లాంటి సినిమా నలభై ఏళ్ళుగా రాలేదు : మోహన్ లాల్

రామ్ వల్లే మాస్టర్ అయ్యా - అల్లు అర్జున్, సుకుమార్ వల్లే పుష్ప2 చేశా : విజయ్ పోలాకి మాస్టర్

Pushpa 2 OTT: పుష్ప 2 ది రూల్ ఓటీటీలోకి ఎప్పుడొస్తుంది..?

నోయల్ బాణీతో రాహుల్ సిప్లిగంజ్ పాట తెలుగోడి బీట్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

తర్వాతి కథనం
Show comments