Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో దారుణ ఘటన-కాబోయే భర్త ఇంట్లో యువతి శవమై..?

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2023 (11:32 IST)
కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాబోయే భర్త ఇంటిలో యువతి శవమై కనిపించింది. కులం కారణంగా తమ బిడ్డను చంపేసి వుంటారని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే  ఆత్మహత్య చేసుకుందని అనుమానాలు వస్తున్నాయి. ఈ ఘటన కర్ణాటకలోని విజయనగర జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే ఐశ్వర్య, అశోక్ కుమార్‌లు పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ మంచి చదువులు చదివారు. మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఐశ్వర్య దళిత సామాజిక వర్గానికి చెందిన యువతి.  అశోక్ కుమార్ కుటుంబం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.
 
ఇంకా తల్లిదండ్రులు కఠినమైన షరతులు పెట్టారు. అంతేకాదు, పెళ్లికి కూడా ఐశ్వర్య కుటుంబ సభ్యులు ఎవరూ రావొద్దని షరతు పెట్టారు. ఇందుకు ఐశ్వర్య కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. వీరి పెళ్లి నవంబర్ 23వ తేదీన ఫిక్స్ అయింది.
 
పెళ్లికి ముందు జరగాల్సిన తంతు కూడా మొదలైంది. ఇందులో ఐశ్వర్య కూడా పాల్గొంది. కానీ, సోమవారం ఆమె ఉరి తాడుకు వేలాడుతూ కనిపించింది. 
 
ఈ ఘటనపై యువతి తండ్రి సరైన దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమ బిడ్డ దళిత కమ్యూనిటీకి చెందిన యువతి కాబట్టి హత్య చేశారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments