Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెస్ట్ బెంగాల్‌లో దారుణం.. అంబులెన్స్ నిరాకరణ.. మహిళ మృతి

Advertiesment
woman on cot
, ఆదివారం, 19 నవంబరు 2023 (11:20 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తీవ్ర అనారోగ్యానికి గురైన మహిళను ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ పంపేందుకు నిరాకరించారు. రోడ్డు బాగాలేదన్న కారణంతో అంబులెన్స్‌ను నిరాకరించింది. దీంతో ఆ మహిళను మంచంపై పడుకోబెట్టి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన బెంగాల్ రాష్ట్రంలోని మాల్దా జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మాల్దా గ్రామానికి 25 యేళ్ల మాము అనే మహిళ కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతుంది. తాజాగా ఆమె తీవ్ర అనారోగ్యంబారిన పడటంతో ఆస్పత్రికి తరలించాలని కుటుంబ సభ్యులు భావించి ప్రైవేటు అంబులెన్స్‌ యజమానులను సంప్రదించారు. 
 
అయితే, అ గ్రామానికి రోడ్డు బాగాలేదంటూ అంబులెన్స్ పంపేందుకు నిరాకరించారు. దీంతో స్థానికులతో కలిసి కుటుంబ సభ్యులు ఆమెను మంచంపై పడుకోబెట్టి ఆమెను మోసుకుంటూ నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న మొడికుపర రూరల్ ఆస్పత్రికి బయలుదేరారు. అయితే, ఆమె మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఇపుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పొరుగింటి యువకుడి జననాంగాలను కోసేసిన వివాహిత