ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ వివాహిత దారుణానికి పాల్పడింది. పొరుగింటి యువకుడిని ఇంటికి పిలిపించి అతని జననాంగాలను కోసేసింది. ఇంట్లో కొద్దిగా పని ఉందని, అది చేసిపెట్టేందుకు ఇంటికి రావాలని పిలిచి ఈ ఘాతుకానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	లక్నో సమీపంలోని షరీఫ్‌పూర్‌కు చెందిన ఓ మహిళ పొరుగింటిలో ఉండే ఓ యువకుడిని ఇంటిలో కొంచెం పని ఉందని చెప్పి ఇంటికి పిలిపించింది. దీంతో ఆమె ఇంటికి ఆ యువకుడు వెళ్ళాడు. ఈ క్రమంలో కొద్దిసేపటికి వారిద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఆ తర్వాత అతడి జననాంగాలను ఆ మహిళ కొసేసింది. పక్కంటి మహిళ ఇంటికి వెళ్లిన కొడుకు ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో యువకుడి తల్లి ఆ మహిళ ఇంటికి వెళ్లి చూడగా, కొడుకు అపస్మారక స్థితిలో పడివున్నాడు. 
 
									
										
								
																	
	 
	ఆ వెంటనే ఇరుగుపొరుగువారి సాయంతో స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించింది. అక్కడ నుంచి ప్రయాగ్ రాజ్ నగరంలోని మరో ఆస్పత్రికి తరలించారు. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ యువకుడి జననాంగాలను కట్ చేయడానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఆమె వద్ద పోలీసులు విచారిస్తున్నారు.