Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాబోయే భర్త ఇంటిలో శవమై కనిపించిన నవ వధువు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2023 (11:19 IST)
కర్నాటక రాష్ట్రంలోని విజయనగర జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. కాబోయే భర్త ఇంటిలో నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ జిల్లాకు చెందిన ఐశ్వర్య, అశోక్ కుమార్ అనే యువతీ యువకులు గత పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ ఉన్నత చదువులు పూర్తి చేసి మంచి ఉద్యోగాలు కూడా సంపాదించుకున్నారు. అయితే, ఐశ్వర్య దళిత సామాజిక వర్గానికి చెందిన యువతి కాగా, అశోక్ కుమార్‌లు గౌడ సామాజిక వర్గానికి చెందిన యువకుడు. కులాంతర వివాహం చేసుకునేందుకు తమతమ తల్లిదండ్రులను వారు ఒప్పించారు. 
 
కానీ, వరుడు తల్లిదండ్రులు కఠిన షరతులు పెట్టారు. పెళ్లి చేసుకుంటే భవిష్యత్‌లో ఐశ్వర్య కుటుంబ సభ్యులు తమతో సంబంధం కొనసాగించడానికి వీల్లేదని, తమ కుటుంబ వ్యవహారాల్లో వారు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని కరాఖండిగా తేల్చి చెప్పారు. దీంతో తమ కుమార్తె భవిష్యత్ కోసం తల్లిదండ్రులు కూడా సమ్మతించారు. 
 
ఈ క్రమంలో ఈ నల 23వ తేదీన వారి వివాహం జరగాల్సివుంది. పెళ్లికి ముందు జరిగే తంతు కూడా మొదలైంది. కానీ, సోమవారం ఉదయానికి వరుడు ఇంటిలో ఐశ్వర్య ఉరికంభానికి వేలాడుతూ కనిపించింది. దీనిపై మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... కేసు విచారిస్తున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన యువతి కావడం వల్లే హత్య చేశారంటూ మతురాలి తల్లిదండ్రులు బోరున విలపిస్తూ ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments