Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజస్థాన్‌లో బస్సు ప్రమాదం.. నలుగురి మృతి - 34 మందికి గాయాలు?

Advertiesment
bus accident
, సోమవారం, 6 నవంబరు 2023 (09:31 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని దౌసాలో రైల్వే ట్రాక్‌పై నుంచి ప్రయాణికుల బస్సు పడిపోవడంతో నలుగురు మృతి చెందారు. మరో 34 మంది వరకు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మందికిపైగా ఉన్నట్టు సమాచారం. 
 
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు ప్రమాద స్థలాన్ని దౌసా అదనపు జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ కుస్వా పరిశీలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెట్రో స్టేషన్‌లో కుప్పకూలిన ప్రయాణికుడు.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన జవాన్