Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి హఠాత్తుగా ఇంటికి వచ్చిన భర్త, మంచం కింద దూరి దగ్గిన ప్రియుడు, అంతే...

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (16:13 IST)
ప్రియుడితో ఎంజాయ్ చేస్తోంది ఒక వివాహిత. భర్తకు, బంధువులకు ఏమాత్రం అనుమానం రాకుండా తన బాగోతాన్ని నడిపింది. కానీ ఎప్పుడో అప్పుడు విషయం బయటకు రావాలిగా. అదే జరిగింది. ఏకంగా భర్తే ఆ మొత్తం వ్యవహారాన్ని చూసేశాడు. దీంతో ఆ వివాహిత కుటుంబ సభ్యుల మధ్య పరువు పోతుందని ఆత్మహత్య చేసేసుకుంది.
 
తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లా వేల్ చందూరు పక్కన ఉన్న కుజలియం పట్టికి చెందిన వేల్ మురుగన్, ధనలక్ష్మిలు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మురుగన్ కరూర్ లోని ఒక టెక్స్‌టైల్ ఎక్స్‌పోర్ట్ పరిశ్రమలో టైలర్‌గా పనిచేస్తున్నాడు.
 
రోజూ కరూర్‌కు వెళ్ళి ఏ అర్థరాత్రికో ఇంటికి వచ్చేవాడు. దీంతో తన ఇంటికి సమీపంలో ఉన్న రమేష్ అనే యువకుడితో ధనలక్ష్మికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త కరూర్‌కు వెళ్ళడం.. రాత్రి చీకటిపడిన తరువాత ఇద్దరు పిల్లలను బయటకు పంపి ప్రియుడితో ఎంజాయ్ చేయడం ధనలక్ష్మికి అలవాటుగా మారింది.
 
ఇందుకోసం తన ఇంటి పక్కనే ఉన్న ఒక పాడుపడిన భవనాన్ని రెడీ చేసేసుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఈ తంతు నడిచింది. భర్త రెండురోజుల క్రితం కరూర్‌కు వెళుతున్నట్లు చెప్పి వెళ్ళాడు. అయితే తను రావడానికి రెండు రోజులు పడుతుందని.. పని ఎక్కువగా ఉందని చెప్పాడు.
 
దీంతో నేరుగా ఇంటికే ప్రియుడు రమేష్‌ను పిలిపించుకుంది ధనలక్ష్మి. పిల్లలను వేరొక గదిలో పడుకోబెట్టి తన గదిలో ప్రియుడితో ఎంజాయ్ చేస్తోంది. ఉన్నట్లుండి భర్త ఇంటికి వచ్చాడు. పిల్లలు నిద్రలేచారు. దీంతో రమేష్‌ను బెడ్ కింద దాచింది. కానీ మురుగన్ లోపలికి వచ్చి తన గదిలో మంచంపై పడుకున్నప్పుడు గట్టిగా దగ్గాడు రమేష్. 
 
దీంతో మంచం కింద వున్న రమేష్‌ను చూసిన మురుగన్ ఆగ్రహంతో ఊగిపోయాడు. చితకబాది ఇంటిలోనే అతడిని కట్టేశాడు. బంధువులను పిలిపించి పంచాయతీ పెట్టాడు. దీంతో పరువు పోయిందని భావించిన ధనలక్ష్మి పెద్దలు మాట్లాడుతుండగానే తన గదిలోకి వెళ్ళింది. బాత్రూంకు వెళ్ళి వస్తానని చెప్పి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments