Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షమీకి భార్య హసీన్ మరో షాక్.. ఇన్‌స్టాలో ఐరా పేరును అలా..?

Advertiesment
షమీకి భార్య హసీన్ మరో షాక్.. ఇన్‌స్టాలో ఐరా పేరును అలా..?
, బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (09:48 IST)
టీమిండియా బౌలర్ మహ్మద్ షమీకి భార్య హసీన్ మరో షాక్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. షమీకి తన కూతురు ఐరా అంటే చాలా ఇష్టం. కేవలం ఐరా కోసం అప్పుడప్పడు ఆమె ఇంటికి వెళుతుండేవాడు. తాజాగా షమీ గారాల పట్టి ఐరాను అతనికి దూరం చేసే పనిలో హసీన్‌ జహాన్‌ ఉన్నట్లు తెలుస్తోంది.
 
ఇటీవలే హసీన్ జహాన్ తన ఇన్‍‌స్టాగ్రామ్‌లో కూతురు ఐరా ఫొటోను షేర్ చేసింది. ఆ ఫొటోలో ఐరా పేరుకు షమీ సర్ నేమ్ ను తొలగించింది. 'ఐరా జహాన్‌' అంటూ క్యాప్షన్‌ జతచేసింది. షమీని కూతురుకు పూర్తిగా దూరం చేయాలనే ఆలోచనతోనే హసీన్‌ జహాన్ ఈ పని చేసినట్లు సమాచారం. 
 
గతంలో షమీపై గృహ లైంగిక వేధింపులు, మ్యాచ్‌ ఫిక్సింగ్‌ లాంటి ఆరోపణలతో హసీన్‌ జహాన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. బీసీసీఐ సీరియస్ గా పరిగణించి…షమీ కాంట్రాక్టును కొన్ని రోజుల పాటు హోల్డ్‌లో పెట్టింది. ఆ తర్వాత షమీ హసీన్‌తో ఉన్న వివాదాలను పరిష్కరించుకోవడానికి కోర్టుకెక్కడంతో బీసీసీఐ అతని కాంట్రాక్టును తిరిగి పునరుద్దరించింది.
 
ఇక షమీ విషయానికి వస్తే… టీమిండియా తరపున షమీ ఇప్పటివరకు 50 టెస్టుల్లో 180 వికెట్లు, 79 వన్డేల్లో 148 వికెట్లు, 12 టీ20ల్లో 12 వికెట్లు తీశాడు. ఆసీస్‌తో డిసెంబర్‌లో జరిగిన మొదటి టెస్టులో గాయపడ్డాడు. 
 
ఈ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్‌లో చివరగా బ్యాటింగ్‌కు వచ్చిన షమీ మణికట్టు గాయంతో రిటైర్డ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఎక్స్‌-రేలో గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తేలడంతో మిగిలిన టెస్టు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఆరంభం కానున్న ఇంగ్లండ్‌ సిరీస్‌కు షమీ దూరంగా ఉన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సౌతాఫ్రికా విజృంభిస్తున్న స్ట్రెయిన్ : ఆసీస్ పర్యటన రద్దు