Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ రోజు అర్థరాత్రి లోపు పాక్ పౌరులు దేశం విడిచి పోవాల్సిందే.. లేకుంటే మూడేళ్లు జైలు!!

ఠాగూర్
మంగళవారం, 29 ఏప్రియల్ 2025 (10:53 IST)
కాశ్మీర్ లోయలోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటన అనంతరం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ రెండు దేశాలు యుద్ధ సన్నాహాల్లో మునిగిపోయాయి. ముఖ్యంగా, భారత్ ప్రతీకార దాడి చేసేందుకు అదును కోసం ఎదురుచూస్తోంది. దీంతో పాకిస్థాన్ పాలకులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అదేసమయంలో దేశ భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ఉంటున్న పాకిస్థాన్ జాతీయుల వీసాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. వీరంతా నిర్ధేశిత గడువులోగా దేశం విడిచి తమ స్వదేశానికి వెళ్ళిపోవాలని స్పష్టం చేసింది. పాక్ పౌరులు భారత్ విడిచి వెళ్లేందుకు ఏప్రిల్ 29వ తేదీ అర్థరాత్రి వరకు గడువు విధించింది.
 
వైద్యం తదితర కారణాలతో మెడికల్ వీసాలపై ఇక్కడకు వచ్చిన వారికి సైతం ఇదే గడువు వర్తిస్తుందని తెలిపింది. గడువులోగా దేశం విడిచి వెళ్లని పక్షంలో వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర హోం శాఖ హెచ్చరించింది. కనీసం మూడేళ్లపాటు జైలుశిక్ష విధించే అవకాశం కూడా ఉంది. కేంద్ర ఆదేశాల నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న పాకిస్థాన్ పౌరులు ఇప్పటికే స్వదేశానికి తిరుగుముఖం పట్టారు. 
 
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో నివసిస్తున్న పాక్ జాతీయులను గుర్తించి, వారిని గడువులోగా పంపించి వేసేందుకు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని స్పెషల్ బ్రాంచ్ అధికారులు నగరంలో నమోదైవున్న పాక్ పౌరుల వివరాలపై ప్రత్యేక దృష్టిసారించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం
Show comments