Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)

Advertiesment
ahmadabad tourist

ఠాగూర్

, సోమవారం, 28 ఏప్రియల్ 2025 (20:05 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడికి సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ నగరానికి చెందిన ఓ పర్యాటకుడు తనకు తెలియకుండానే ఉగ్రవాదుల నరమేధాన్ని తన కెమెరాలో బంధించాడు. ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఆ పర్యాటకు రోప్ కారులో ప్రయాణిస్తుంటే, బైసరన్ లోయలో ఉగ్రవాదులు పర్యాటకులపై విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతున్నారు. ఉగ్రవాదుల తుపాకీ తూటాలకు పర్యాటకులు పిట్టల్లా కిందపడిపోతున్న దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తున్నాయి. 
 
సరిహద్దులకు చైనా శతఘ్నలను తరలిస్తున్న పాకిస్థాన్ - అప్రమత్తమైన భారత్!! 
 
కాశ్మీర్ లోయలోని పహల్గాం, బైసరన్ లోయలో విహరిస్తున్న పర్యాటకులపై పాక్ ప్రేరిపిత ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ కీలకమైన సైనిక చర్యలకు ఉపక్రమించింది. చైనా నుంచి సేకరించిన శక్తివంతమైన ఎస్‌హెచ్-15 సెల్ఫ్ ప్రొపెల్డ్ అర్టిలరీ వ్యవస్థలను పాకిస్థాన్ సైన్యం భారత సరిహద్దు సమీప ప్రాంతాలకు తరలిస్తోంది. 
 
పాకిస్థాన్ బలగాలు భారీ చైనా ఆయుధాలను తరలిస్తున్నట్టు చూపుతున్న కొన్ని వీడియోల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాశ్మీర్ ఘటన తర్వాత రెండు రాత్రుల పాటు సరిహద్దుల్లో ఇరు దేశాల బలగాల మధ్య తీవ్ర స్థాయిలో కాల్పులు జరిగాయి. ఆ తర్వాత ఈ ఆయుధాల మొహరింపు జరగడం గమనార్హం. ఈ పరిణాణం సరిహద్దుల్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులకు అద్దంపడుతోంది. 
 
తాజా నివేదిక ప్రకారం.. చైనా నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో పాకిస్థాన్ అగ్రస్థానంలో ఉన్న విషయం తెల్సిందే. ఇస్లామాబాద్‌‍కు బీజింగ్‌‍కు పెద్ద ఎత్తున సైనిక సహకారం అందిస్తోందనే వాస్తవాన్ని ఎస్‌హెచ్-15 ఫిరంగుల మొహరింపు మరోమారు స్పష్టం చేసింది. చైనా, పాకిస్థాన్ దేశాల మధ్య సైనిక సంబంధాలు మరింతగా బలపడుతున్నాయని ఈ పరిణామం సూచిస్తుంది. 
 
చైనా తయారీ ఎస్‌హెచ్-15 ఫిరంగులు అధునాతనమైనవి, వేగంగా కదిలించగల సామర్థ్యం కలిగినవిగా రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్థాన్ తన సరిహద్దుల వద్ద చైనా ఆయుధాలను మొహరించడంతో భారత భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికపుడు నిశితంగా గమనిస్తున్నట్టు రక్షణ వర్గాలు తెలిపాయి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)