Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Pahalgam Terrorist Attack కుల్గాంలో ఎన్‌కౌంటర్: పెహల్గాం ఉగ్రవాదులేనా?

Advertiesment
JK Police

ఐవీఆర్

, బుధవారం, 23 ఏప్రియల్ 2025 (18:53 IST)
జమ్మూ: దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని టాంగ్‌మార్గ్ ప్రాంతంలో బుధవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. అనుమానాస్పద కార్యకలాపాల గురించి నిర్దిష్ట సమాచారం అందిన తర్వాత గట్టి వలయం ఏర్పాటు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
 
సోదాల సమయంలో భద్రతా దళాలపై భారీ కాల్పులకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. దీనితో ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని, భారీ కాల్పులు కొనసాగుతున్నాయని అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. అదనపు బలగాలను పంపించాయి. మరింత సమాచారం అందాల్సి వుంది.
 
కాగా పెహల్గాం నుంచి కుల్గాంకు మధ్య దూరం 60 కిలోమీటర్లు. ఉగ్రవాదులు దాడికి తెగబడిన తర్వాత కుల్గాంకు పారిపోయి వుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు అక్కడ భద్రతా దళాలకు టెర్రరిస్టులకు మధ్య కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు