బీహార్ రాష్ట్రంలోని దర్బంగాలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లల తల్లి బాలికతో పారిపోయింది. భర్తనైనా వదులుకుంటానుగానీ, ఆ బాలికను మాత్రం వదులుకోనని చెప్పి మరీ లేచిపోయింది. ఆ తర్వాత బాలికను పెళ్లి చేసుకుంది. ఈ పాడుపనికి పాల్పడిన మహిళ పేరు కృతీదేవి. ముగ్గురు బిడ్డల తల్లి.
ఈమెకు 11 యేళ్ల క్రితం కృష్ణ అనే వ్యక్తితో 11 యేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఆయన రాజస్థాన్ రాష్ట్రంలో కార్మికుడుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో పటాహీ గ్రామానికి చెందిన ఓ బాలికతో కృతీదేవికి ఫోనులో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వారిద్దరి మధ్య శారీరక సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న భర్త కృష్ణ.. భార్యను మందలించాడు. పద్దతి మార్చుకోవాలని పదేపదే హెచ్చరించసాగాడు.
అయితే, ఆ మహిళ మాత్రం.. తన పద్దతి మార్చుకోకపోగా, అవసరమైతే నిన్ను వదిలేస్తాగానీ, ఆ బాలికను మాత్రం వదిలివేసే ప్రసక్తే లేదని భర్తకు తెగేసి చెప్పింది. ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీన ఆ బాలికతో ఆ మహిళ పారిపోయింది. దీనిపై మహిళ భర్తతో పాటు బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి, కృతీదేవి, బాలికను శనివారం అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.