Webdunia - Bharat's app for daily news and videos

Install App

బారాముల్లాకు బదిలీ చేయాలా? యువ ఐపీఎస్‌కు వార్నింగ్ ఇచ్చిన అధికారి

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (15:56 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో యువ ఐపీఎస్ అధికారికి ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత, బీజేపీకి చెందిన సువేందు అధికారి గట్టి వార్నింగ్ ఇచ్చారు. కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ లేదా బారాముల్లాకు ట్రాన్స్‌పఱ్ చేసేలా ఏ పనీ చేయొద్దంటూ హితవు పలికారు. అంతేకాకుండా, మీ వెనుకాల రాష్ట్ర ప్రభుత్వం ఉంటే మా వెనుక కేంద్ర ప్రభుత్వం అండగా ఉందని ఆయన హెచ్చరించారు. 
 
ఈస్ట్ మేదినిపూర్ ఎస్పీగా ఉన్న అమ‌ర్‌నాథ్ ఉన్నారు ఆయనకు సువేందు అధికారి గట్టి వార్నింగ్ ఇచ్చారు. సువేందుపై ఉన్న ఆరోప‌ణ‌ల‌పై మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించింది. ఆయ‌న సెక్యూరిటీ గార్డ్ హ‌త్య‌పై సీఐడీ, ఓ దొంగ‌త‌నం కేసులో పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.
 
దీనిపై సువేందు అధికారి స్పందిస్తూ, ఆ యువ ఐపీఎస్ అధికారి కాల్ రికార్డుల‌న్నీ త‌న ద‌గ్గ‌ర ఉన్నాయ‌న్నారు. జాగ్ర‌త్త‌గా ఉండాలంటూ హెచ్చ‌రించారు. 'అమ‌ర్‌నాథ్ అనే ఓ యువకుడు ఇక్క‌డికి ఎస్పీగా వ‌చ్చాడు. అత‌నేంటో నాకు తెలుసు. అత‌నికి ఒక్క‌టే చెప్ప‌ద‌ల‌చుకున్నా. నువ్వో సెంట్ర‌ల్ కేడ‌ర్ అధికారివి. నిన్ను క‌శ్మీర్‌లోని అనంత్‌నాగ్ లేదా బారాముల్లాకు ట్రాన్స్‌ఫ‌ర్ చేసేలా ఏ ప‌నీ చేయొద్ద‌ని చెబుతున్నా అని సువేందు అన్నారు.
 
మేన‌ల్లుడి (టీఎంసీ ఎంపీ అభిషేక్ బెన‌ర్జీ) ఆఫీస్ నుంచి ఎవ‌రెవ‌రు నీకు కాల్ చేస్తున్నారో అన్ని రికార్డులు నా ద‌గ్గ‌ర ఉన్నాయి. నీకు రాష్ట్ర ప్ర‌భుత్వం అండ‌గా ఉంటే మాకు కేంద్ర ప్ర‌భుత్వం అండ‌గా ఉంది అని సువేందు అన‌డం గ‌మ‌నార్హం. ఎస్పీ ఆఫీస్ ద‌గ్గ‌ర నిర్వ‌హించిన ఆందోళ‌న‌లో బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి సువేందు మాట్లాడారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments