Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శేఖర్ మాస్టర్ ఆవిష్క‌రించిన `జెట్టి`లో 'జిల్ జిల్.` గీతం

శేఖర్ మాస్టర్ ఆవిష్క‌రించిన `జెట్టి`లో 'జిల్ జిల్.` గీతం
, సోమవారం, 19 జులై 2021 (16:45 IST)
Gettysong- Shekhar Master
 
 
నందిత శ్వేతా, మన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "జెట్టి". తెలుగు, తమిళ, కన్నడ,  మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వర్ధిన్ ప్రొడక్షన్స్ పతాకంపై వేణు మాధవ్ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుబ్రమణ్యం పిచ్చుక దర్శకుడు. కార్తీక్ కొడకండ్ల సంగీతాన్ని అందించిన "జెట్టి" సినిమాలోని ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తున్నారు చిత్ర బృందం.
 
సోమవారం ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ "జెట్టి" సినిమా నుంచి 'జిల్ జిల్..' అనే పాట లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే.....ఎటైనాదే, మీకేటైనాదే... వాటం జూస్తే యమ ఘాటున్నాదే..జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు బాబులు జిల్ జిల్ జిల్ జిల్..ఘల్ ఘల్ ఘల్ ఘల్ గాలాలు యేస్తరు ఘల్ ఘల్ ఘల్ ఘల్ అని సాగుతుంది. ఈ

పాటను గీత రచయిత కాసర్ల శ్యామ్ రాయగా, పాపులర్ ఫోక్ సింగర్ మంగ్లీ ఆలపించారు. కార్తీక్ కొడకండ్ల మ్యూజిక్ కంపోజిషన్ ఆకట్టుకుంది. ఒక సెలబ్రేషన్స్ మూడ్లో సాగే ఈ స్పెషల్ సాంగ్ని హుషారెత్తించే కొరియోగ్రఫీతో మరింత ఉత్సాహంగా మలిచాడు అనీష్.  శేఖర్ మాస్టర్ శిష్యుడు అనీష్ జిల్ జిల్ పాటకు అదిరిపోయే మాస్ స్టెప్పులు వేయించారు. రీసెంట్గా రిలీజ్ అయినా మౌనం కరిగినా అనే పాట యూత్ ని ఉర్రూతలూగిస్తుంది. సిద్ శ్రీరాం పాడిన ఈ పాట మ్యూజిక్ లవర్స్ ని మనసులు గెలుచుకుంది.
 
ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ... మా అనీష్ "జెట్టి" మూవీలో 'జిల్ జిల్..' సాంగ్ కు చాలా బాగా కొరియోగ్రఫీ చేశాడు. ఈ పాటలో ఫర్మార్మ్ చేసింది తేజస్వినీ. తను 'ఢీ' షోలో లేడీ కంటెస్టెంట్. తేజస్వినీ 'ఢీ' లేడీ కంటెస్టెంట్స్ లో బెస్ట్ డాన్సర్. ఇది నేను చెప్పడం కాదు, రేపు పాట చూసి మీరే చెబుతారు. మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ మంచి ట్యూన్స్ ఇచ్చాడు. దర్శకుడు సుబ్రహ్మణ్యంతో నాకు చాలా కాలంగా పరిచయం ఉంది. సాంగ్ చాలా బాగుంది. నిర్మాత వేణు మాధవ్ గారికి అండ్ ఎంటైర్ టీమ్ కు ఆల్ ది బెస్ట్. అన్నారు.
 
ఓ మత్య్సకార గ్రామంలో జరిగిన ఘటనలను ఆధారంగా తీసుకుని "జెట్టి" సినిమా తెరకెక్కుతోంది. మత్య్సకారుల జీవన విధానాలను, వారి కట్టుబాట్లను, ఇప్పటి వరకూ వెండితెరమీద కనిపించని జీవితాలను తెరమీద హృద్యంగా తీసుకురాబోతున్నాడు దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుక. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రవితేజ రామారావు ఆన్‌ డ్యూటీ,లోరాజీషా విజయన్‌