Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

`విక్రమ్'లోని పడిపోయా పడిపోయా పాట విడుదల

Advertiesment
`విక్రమ్'లోని పడిపోయా పడిపోయా పాట విడుదల
, శుక్రవారం, 4 జూన్ 2021 (17:27 IST)
Naga varma, divya
'విక్రమ్' చిత్రంలోని `పడిపోయా పడిపోయా` అంటూ సాగే రెండవ పాటను, ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ విడుదల చేశారు. నాగవర్మ బైర్రాజును హీరోగా పరిచయం చేస్తూ, హరిచందన్ దర్శకత్వంలో ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. దివ్యాసురేశ్ కథానాయికగా నటించింది. శనివారం ఈ చిత్ర హీరో, నిర్మాత నాగవర్మ బైర్రాజు పుట్టినరోజు సందర్భంగా ఈ పాటను హైదరాబాద్ లో విడుదల చేశారు.
 
అనంతరం శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ, నాగార్జున గారు "విక్రమ్" అనే పేరు గల చిత్రంతో పరిచయమయ్యారు. అదే టైటిల్ తో వస్తున్న హీరో నాగవర్మకు కూడా ఈ తొలి చిత్రం మంచి విజయాన్ని అందించి అతను హీరోగా నిలబడాలని కోరుకుంటున్నా. పడిపోయా పడిపోయా అనే ఈ పాట ప్రేమికులకు ఎంతో స్ఫూర్తిని కలిగించేలా ఆకట్టుకుంటోంది. నాగవర్మ చక్కటి అభినయంతో పాటలలో అలరింపజేస్తూ, ఫైట్స్ లోనూ కుమ్మేశాడు" అని అన్నారు.
 
నాగవర్మ బైర్రాజు మాట్లాడుతూ, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అద్భుతం.\మా సినిమా పాటలు, టీజర్, పోస్టర్స్ పలువురు సినీ ప్రముఖుల ద్వారా విడుదల అవుతుండటం ఎనలేని ఆనందంగా ఉంది. టీం సమష్టి కృషితో చిత్రం చాలా బాగా వచ్చింది" అని అన్నారు.
సంగీత దర్శకుడు సురేష్ ప్రసాద్ మాట్లాడుతూ,* ఇందులోని ఐదు పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతో బాగా వచ్చిందని చెప్పగా  *కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ మాట్లాడుతూ, ఇందులో నాలుగు పాటలకు తాను కొరియోగ్రఫీ చేశానని అన్నారు.
 
దర్శకుడు హరిచందన్ మాట్లాడుతూ, మ్యూజికల్ ప్రేమ కథకు థ్రిల్లర్ అంశాలను మిళితం చేసి నవ్యరీతిలో ఈ చిత్రాన్ని మలిచాం. విక్రమ్ అనే ఓ సినిమా రచయిత పాత్ర చుట్టూ తిరిగే కొన్ని పాత్రల స్వరూప స్వభావాలను ఇందులో చూపించాం. ఇంకా చెప్పాలంటే సొసైటీలోని పాత్రలకు దగ్గరగా ఈ పాత్రలు ఉంటాయి. తన ప్రేమను సాధించడం కోసం, ప్రేమించిన అమ్మాయిని పొందడం కోసం ఆ సినిమా రచయిత ఏమి చేశాడన్నది ఆసక్తికరంగా చెప్పాం. థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నాం" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాన్నే నాకు భ‌గ‌వంతుడుః చ‌ర‌ణ్‌