షూటింగ్లో హీరోయిన్లు ఒక రోజుకు కష్టపడేది చాలా తక్కువే. కానీ అవసరమైతే నైట్ కూడా చేయాలంటే మరుసటి రోజు చేద్దామని అంటారు. అది మామూలు రోజులు. కానీ కరోనా టైంలో షూటింగ్ చేయాలంటే కష్టమే. కానీ దాన్ని సుసాధ్యం చేసింది రాశీఖన్నా. కరోనా సెకండ్‌వేవ్ టైంలో షడెన్‌గా ఇండియా నుంచి ఇటలీ వెళ్ళారు ఆమె. `థ్యాంక్యూ` సినిమా కోసం అక్కడకు వెళ్లేముందు భయమేసిందట. కొంత వర్క్ చేస్తే సినిమా పూర్తవుతుంది. అలాంటి టైంలో వెళ్ళక తప్పలేదు.
నాగచైతన్య, మనం దర్శకుడు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. నాగచైతన్య మహేష్‌బాబు అభిమానిగా నటిస్తున్నాడట. ఓ పాత్రను అవికాగోర్ కూడా చేసిందట. అంతేకాకుండా మాళవిక నాయర్‌తోపాటు రాశీఖన్నా కూడా మరో హీరోయిన్. అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం వెళ్ళక తప్పలేదు. కానీ భయంగా ఇటలీ వెళ్ళాను. చాలా జాగ్రత్తలు తీసుకున్నా. షూటింగ్ త్వరగా ముగించాలంటే రోజుకు 18 గంటలు పనిచేయాల్సి వచ్చింది. ఈ శ్రమతో ఆరోగ్యం ఏదైనా డిస్టబ్ అవుతుందేమోనని భావించాను. కానీ థ్యాంక్ గాడ్ అదేమీ రాలేదు. మొత్తానికి షూటింగ్ పూర్తిచేశాం. చాలా హ్యాపీగా వుందని తాజాగా రాశీకన్నా ట్వీట్ చేసింది. శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ బేనర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.