Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

`సిలక ముక్కు దానా' సాంగ్ లో అద‌ర‌గొట్టిన దివి వధ్య

Advertiesment
Silaka Mukku Dana Song
, శనివారం, 3 జులై 2021 (17:43 IST)
Divi Vadhya,
దివి వధ్య ఇటీవ‌ల ఏదో ర‌కంగా వార్త‌ల్లో ఉంటూ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం వరుసగా అవకాశాలు అందుకుంటున్న దివి తాజాగా నివృతి వైబ్స్‌ రూపొందించిన 'సిలకా ముక్కు దానా' అనేది తెలంగాణ ఫోక్ సాంగ్ తో మ‌రోసారి టాక్ఆఫ్‌ది టౌన్ అయ్యింది. 
 
ఈ పాట‌కు ప్ర‌ముఖ గీత రచయిత కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా సింగర్ హరిక నారాయణ్ ఆలపించారు. మదీన్ ఎస్.కె దీనికి బాణీలు సమకూర్చారు. తాజాగా విడుదలైన ఈ పాట క్యాచీగా ఉండటంతో పాటుగా అందరూ కాలు కదిపేలా ఉంది.
 
దివి వధ్య తన గ్లామర్, మాస్ డ్యాన్స్‌తో  'సిలక ముక్కు దానా' సాంగ్ ను నెక్స్ట్లెవల్ కి తీసుకెళ్లింది. ఆమె హాట్ ఎక్స్ప్రెషన్స్..ఇందులో అమ్మడి యాటిట్యూట్,  డ్యాన్స్ మూమెంట్స్ అంద‌రి హృదయాలను కొల్లగొడుతున్నాయి. శేఖర్ మాస్టర్ ఈ మ్యూజిక్ వీడియోకు కొరియోగ్రఫీ చేయడంతో పాటు స్వ‌యంగా దర్శకత్వం వహించారు. ఈ సాంగ్ కు మంత్ర శివ సినిమాటోగ్రఫీ అందించగా ఉదయ్ ఎడిట‌ర్‌, రామ్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. జ్యోతి కున్నూరు ఈ పాటను నిర్మించారు. దివి హాట్ అండ్ టెర్రిఫిక్ డాన్స్ నెంబర్ 'సిలకా ముక్కు దానా' ఈ సీజన్ లో బెస్ట్ మ్యూజిక్ వీడియోలలో ఒకటిగా నిలుస్తుందని చెప్పవచ్చు.
 
ప్రొడ్యూస‌ర్‌: జ్యోతి కున్నూరు, కొరియోగ్ర‌ఫి& డైరెక్ష‌న్‌: శేఖ‌ర్ వీజే, ఆర్టిస్ట్: దివి, లిరిక్స్‌: కాస‌ర్ల శ్యామ్‌,  సింగ‌ర్ - హ‌రిక నారాయ‌ణ్‌,  మ్యూజిక్ - మ‌ధీన్ ఎస్ కే, డి ఓ పి -  మంత్ర శివ‌, ఎడిట‌ర్ - ఉద‌య్‌, డీఐ - అన్న‌పూర్ణ స్టూడియో, హెడ్ ఆఫ్ ఆప‌రేష‌న్స్ - లాస్య ప్రియా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మమ్ముట్టి `గ్రేట్ శంకర్`టీజర్ వ‌చ్చేసింది