Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హర్భజన్ సింగ్ `ఫ్రెండ్ షిప్`లోని 'అరిచి అరగదీయమ్మ' పాట

Advertiesment
హర్భజన్ సింగ్ `ఫ్రెండ్ షిప్`లోని 'అరిచి అరగదీయమ్మ' పాట
, శనివారం, 3 జులై 2021 (16:04 IST)
Friendship song
బౌలర్ గా క్రికెట్ ఆటలో ఎన్నో రికార్డులను సృష్టించిన ఆటగాడు హర్భజన్ సింగ్. బ్యాట్ తో కూడా సిక్సులతో సమాధానం చెప్పే బజ్జీ పుట్టిన రోజు నేడు.అయన నటుడిగా తెరంగేట్రం చేస్తున్న `ఫ్రెండ్ షిప్‌` చిత్ర బృందం ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ఈ సినిమాలో 'అరిచి అరగదీయమ్మ' అనే సాంగ్ ని విడుదల చేసింది.

ఈ సినిమా లో యాక్షన్ కింగ్ అర్జున్ కూడా నటిస్తుండడం విశేషం. 'జాన్ పాల్ రాజ్-శ్యామ్ సూర్య' సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆర్.కె ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏ.ఎన్. బాలాజీ నిర్మిస్తున్నాడు. ప్రముఖ తమిళ నిర్మాత జె.సతీష్ కుమార్ (జెఎ స్ కె) విలన్ గా, తమిళ బిగ్ బాస్ విన్నర్, మాజీ 'మిస్ శ్రీలంక' 'లోస్లియా' హీరోయిన్ గా నటిస్తున్నారు. 25 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం యొక్క టైటిల్ లోగోను మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్ధ స్వామి మంత్రాలయంలో ఆవిష్కరించగా భారీ స్పందన దక్కింది. త్వరలోనే రామోజీ ఫిలిం సిటీ లో పాట, ఫైట్ ను షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. 
 
నటీనటులు : హర్భజన్ సింగ్, అర్జున్, లోస్లియా, జె.సతీష్ కుమార్, సతీష్ తదితరులు..
సాంకేతిక నిపుణులు : 
సమర్పణ : ఆర్.కె ఎంటర్ టైన్మెంట్స్మా, టలు: రాజశేఖర్ రెడ్డి, సంగీతం: డి.ఎం.ఉదయ్ కుమార్సి, నిమాటోగ్రఫీ:  శాంతకుమార్, నిర్మాత: ఏ.ఎన్.బాలాజీ,  దర్శకత్వం: జాన్ పాల్ రాజ్-శ్యామ్ సూర్య

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆక‌ట్టుకుంటోన్న`డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ` థీమ్ సాంగ్‌