ఇంతకుముందు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున చింరజీవి ఆధ్వర్యంలో అపోలో ఆసుపత్రిలో సీనీ కార్మికులకు వేయిస్తున్న టీకాల కార్యక్రమం మరలా ప్రారంభమైంది. ఉపాసన కొణిదెల పుట్టినరోజు మంగళవారంనాడు కావడంతో జూబ్లీహిల్స్ అపోలో సెకండోస్ వేయించుకోవాల్సిన వారిని ఈరోజు ఆహ్వానించారు. యాదృశ్చికమో, పుట్టినరోజు కావడంవల్ల ఇలా సినీ కార్మికులు కోవీషీల్డ్ వేయించుకోవడం జరిగింది. ఇందుకు వారంతా ఉపాసనకు అక్కడి స్టాఫ్ సమక్షంలో ధన్యవాదాలు తెలిపారు.
మామూలుగా అపోలో వేక్సిన్ వేయించుకోవాలంటే 750 రూపాయలు కట్టాలి. అది ఉచితంగా సీసీసీ తరఫున టీకా వేసుకున్న కార్మికులకు రసీదులో 750 రూపాయలు అని వుంటుంది. దాన్ని సి.సి.సి. అపోలోకు కడుతుందని అక్కడి నిర్వాహకులు తెలియజేశారు. ఇలా సి.సి.సి. తరఫున వేలాది మంది సీనీ కార్మికులు వేయిస్తున్న టీకాల విలువ లక్షల్లో వుంటుంది. ఇదేకాకుండా గతంలో సి.సి.సి. తరఫున వేలాదిమంది సీనీ కార్మికులకు కరోనా ఫస్ట్ వేవ్‌లో నిత్యావసర సరుకులు రెండు పర్యాయాలు అందజేశారు.
ఈరోజు తన భార్య పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో తన ప్రేమను ప్రత్యేకంగా చరణ్ వ్యక్తపరిచాడు. “అవసరంలో ఉన్న ప్రజలకు కానీ నీ కుటుంబానికి కానీ నీ బెస్ట్ ఉవ్వడంలో ఎప్పుడూ నువ్వు వెనకడుగు వెయ్యలేదు, నీకు థాంక్స్ చెప్పడానికి ఏ గిఫ్ట్ కూడా సరిపోదు, హ్యాపీ బర్త్ డే” అంటూ తన ప్రేమను వ్యక్తం చేస్తున్నారు.