తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దాదాపు 24 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన సోమవారం సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా తాను త్వరగా కోలుకోవాలని, తన ఆరోగ్యం కుదుటపడాలని కోరుతూ పూజలు చేసిన అభిమానులు, నాయకులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు వీహెచ్.
కాగా, అనారోగ్యం కారణంగా వీహెచ్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. పలువురు కాంగ్రెస్ నేతలు ఆయనను ఆస్పత్రిలో పరామర్శించారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సైతం వీహెచ్ ఆరోగ్యంపై ఆరా తీశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత రేవంత్‌రెడ్డి ఇటీవల ఆసుపత్రిలో వీహెచ్‌ను కలిసి పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.